Wednesday, March 11, 2009

పరా పూజ

అఖండే సచ్చిదానందే నిర్వికల్పైకరూపిణి |
స్థితే అద్వితీయ భావే అస్మిన్ కథం పూజా విధీయతే ||

ఆత్మా త్వం, గిరిజా మతిః, సహచరాః ప్రాణాః, శరీరం గృహం,
పూజా తే వివిధొపభొగరచనా, నిద్రా సమాధిస్థితిః,
సంచారః పదయోః ప్రదక్షిణ విధిః, స్తోత్రాణి సర్వాగిరౌ,
యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం.

---శ్రీ శంకరాచార్య (పరా పూజ స్తోత్రం నుంచి)

నిజంగా చెప్పాలంటే ధర్మబద్దమైన కర్మలన్నీ ఆరాధనమే.
జ్ఞాని చేసే ప్రతి కర్మా ఈశ్వరారాధనమే.
ఈ పైన చెప్పిన "పరా పూజ" తత్త్వం అర్ధం కాక పోతే
"క్షమ" కోసం కరుణా సముద్రుణ్ణి ఇలాప్రార్ధించాలి:

కర చరణ కృతం వా, కర్మ వాక్కాయజం వా,
శ్రవణ నయనజం వా, మానసం వాపరాధం |
విహితమవిహితం వా సర్వమేతత్ క్షమస్వ
జయ జయ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో ||

ఇక ఇదీ కుదరని పక్షంలో అమ్మవారికి పూర్తి శరణాగతిని తెలియజేసే మార్గం:

మత్సమః పాతకీ నాస్తి పాపఘ్నీ త్వత్సమా న హి |
ఏవం జ్ఞాత్వా మహాదేవీ యథా యోగ్యం తథా కురు || 


దేవీ! యావత్ప్రపంచంలో నాకు సముడైన పాపి లేడు. నీకు సాటి వచ్చే పాపక్షాళన శక్తి లేదు. దీనిని మనస్సున ఉంచుకుని నీకెలా తోస్తే అలా చేయి!

ఈ విధంగా జ్ఞాన, కర్మ, భక్తి యోగాలు పరిసమాప్తమవుతాయి.

ఈశ్వరార్పణమస్తు

No comments: