Sunday, June 7, 2009

కృషి పౌర్ణమి

పొలాలనన్నీ,
హలాలదున్నీ,
ఇలాతలంలో హేమం పిండగ,
జగానికంతా సౌఖ్యం నిండగ,
విరామమెరుగక పరిశ్రమించే,
బలం ధరిత్రికి బలి కావించే,
కర్షక వీరుల కాయం నిండా
కాలువకట్టే ఘర్మజలానికి,
ఘర్మజలానికి,
ధర్మజలానికి,
ఘర్మజలానికి ఖరీదులేదోయ్.

-- ప్రతిజ్ఞ అనే శ్రీ శ్రీ కవిత నుంచి (మహాప్రస్థానం సంకలనం) ఏరువాక పౌర్ణమి సందర్భంగా;

2 comments:

మరువం ఉష said...

నిన్న రాత్రి నాన్నగారి తో మాట్లాడినపుడు అంతకు మునుపే షటిల్ ఆడుతూ దేదీప్యంగా వెలిగిన చంద్రుడిని గురించి ప్రస్తావిస్తే "అవునమ్మా, 6/7 ఏరువక పున్నమి" అని చెప్పారు. రెండు పంక్తులు వ్రాసుకున్న ఆ కవితని పొడిగించే ముందు జాలానికి రావటంతో ఈ అరుదైన కవిత చూసాను/ కృతజ్ఞతలు.

Prasad Chitta said...

Dear Usha,

Very Nice, It gave me a chance to look at few good blogs including yours.

Thanks
Prasad