Wednesday, September 29, 2010

అంతా రామమయం

అంతరంగమున ఆత్మారాము డనంత రూపమున వింతలు సలుపగ అంతా రామమయం బీ జగమంతా రామమయం
సోమ సూర్యులును సురలు తారలును ఆ మహాంబుధులు నఖిల జగంబులు అంతా రామమయం బీ జగమంతా రామమయం
అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మ మొదలుగ అంతా రామమయం బీ జగమంతా రామమయం
నదులు వనంబులు నానా మృగములు విదిత కర్మములు వేదశాస్త్రములు అంతా రామమయం బీ జగమంతా రామమయం
అష్ట దిక్కులును ఆదిశేషుడును అష్ట వసువులును అరిషడ్వర్గము అంతా రామమయం బీ జగమంతా రామమయం
ధీరుడు భద్రాచల రామదాసుని కోరిక లొసగెడి తారక నామము అంతా రామమయం బీ జగమంతా రామమయం

---- భద్రాచల రామదాసు

No comments: