Friday, October 22, 2010

సులభం - దుర్లభం

సులభాః పురుషా రాజన్ సతతం ప్రియ వాదినః |
అప్రియస్య చ పథ్యస్య వక్తా శ్రొతా చ దుర్లభః ||
sulabhaaH puruSaa raajan satatam priya vaadinaH |
apriyasya ca pathyasya vaktaa shrotaa ca durlabhaH ||

రాజన్= ఓ రాజా; ప్రియ వాదినః పురుషా= ప్రియ వాదులైన పురుషులు; సతతం సులభాః= ఎప్పుడూ తెలికగా దొరుకుతారు ; అ + ప్రియస్య= (చూడడానికి అప్రియంగా కనిపించినప్పటికీ) ; పథ్యస్య చ= మంచి మాటలు (పథ్యం ఔషధాన్ని బలపరుస్తుంది) ; వక్తా= చెప్పే వారు; (మరియు); శ్రొతా చ= వినేవారు కూడా; దుర్+లభః= దొరకటం చాలా కష్టము.

raajan= oh, king; priya vaadinaH puruSaa= pleasantly, talking, people; satatam sulabhaaH= always, easy - easy to get; a + priyasya= of un, pleasant - judgementally; pathyasya ca= recuperative insipid diet-like [suggestions,] also; vaktaa= who speaks them; or even; shrotaa ca= listener, also; dur labhaH= not, possible - impossible to get.


"It will always be easy to get people who talk pleasantly, oh, king, but it is impossible to get them who talk judgementally and give suggestions that may be apparently insipid, but that are recuperative, more so, it is impossible to get listeners of such advises.

--వాల్మీకి రామాయణము, అరణ్య కాండము 37 వ సర్గ. మారీచుడు రావణునికి "సీతను అపహరించ వద్దు" అనే సలహా ఇవ్వడానికి ముందు ఈ మంచి మాట చెపుతాడు.

నిజంగా మంచి మాటలు చెప్పే వారు దొరకడం కష్టం. ఒకవేళ చెప్పేవారున్నా వినేవాళ్ళు దొరకడం ఇంకా కష్టం. ఐనప్పటికీ కూడా ఎక్కడొ ఒకచొట వినేవాళ్ళుండకపోతారా అని వాల్మీకి లాంటి మహా ఋషులు కావ్యాలని జనరంజకంగా తేలిక మాటల్లొ ఇటువంటి గొప్ప నిజాలని వ్యక్త పరుస్తూ రచించారు.

(శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం లొ ఉటంకించబడి నా దృష్టి లోకి వచ్చింది ఈ రామాయణం లోని మారీచుని మంచి మాట. ఈ రొజు శ్రీ వాల్మీకి జయంతి - అశ్వయుజ పౌర్నమి సందర్భంగా ఈ బ్లాగ్ లొకి!)

No comments: