Thursday, December 22, 2011

యోజకః - Organiser/Leader

అమంత్రం అక్షరో నాస్తి నాస్తి మూలం అనౌషధం
అయోగ్యః పురుషో నాస్తి యోజకః తత్ర దుర్లభః ||

amantram aksharO nAsti nAsti mUlaM anaushadhaM
ayOgya@h purushO nAsti yOjaka@h tatra durlabha@h  ||


There is no aksharam (sound) that has no mantra shakti (magical power)
There is no mUlam (root of a herb) which has no medicinal power
There is no person who has no skill (i.e., every person is gifted with his/her unique skill)

Then what is it difficult?

yOjakaH (One who can employ the right person/medicine/sound in a given situation to achieve desired result) i.e., a right organizer or a Leader is the one who is difficult to find. 

om tat sat

--ఉత్తరాయణ పుణ్య కాలం లో ఈ సకల చరాచర జగత్తుకూ యోజకుడైన పరమాత్మ ను తలచుకుంటూ.... 

Monday, December 19, 2011

What makes a man commit sin?

What makes a man commit sin?






-- శ్రీ ఖర నామ సంవత్సర మార్గశిర బహుళ నవమి 

Friday, December 16, 2011

ప్రౌఢానుభూతి

నిర్ద్వైతోఽస్మ్యహమస్మి నిర్మలచిదాకాశోఽస్మి పూర్ణోఽస్మ్యహం
నిర్దేహోఽస్మి నిరిన్ద్రియోఽస్మి నితరాం నిష్ప్రాణవర్గోఽస్మ్యహమ్ |
నిర్ముక్తాశుభమానసోఽస్మి విగలద్విజ్ఞానకోశోఽస్మ్యహం
నిర్మాయోఽస్మి నిరన్తరోఽస్మి విపులప్రౌఢప్రకాశోఽస్మ్యహమ్ || ౫||

निर्द्वैतोऽस्म्यहमस्मि निर्मलचिदाकाशोऽस्मि पूर्णोऽस्म्यहं
निर्देहोऽस्मि निरिन्द्रियोऽस्मि नितरां निष्प्राणवर्गोऽस्म्यहम् ।
निर्मुक्ताशुभमानसोऽस्मि विगलद्विज्ञानकोशोऽस्म्यहं
निर्मायोऽस्मि निरन्तरोऽस्मि विपुलप्रौढप्रकाशोऽस्म्यहम् ॥ ५॥

-- ప్రౌఢానుభూతి నుంచి

Wednesday, December 14, 2011

చేసిన కొద్దీ పెరిగేవి

उद्योगः कलहः कण्डूर्द्यूतः मद्यं परस्त्रियः
अहारो मैथुनं निद्रा सेवनात्तु विवर्धते

ఉద్యోగః కలహః కణ్డూర్ద్యూతః మద్యం పరస్త్రియః
అహారో మైథునం నిద్రా సేవనాత్తు వివర్ధతే

ఏదో ఒక పని (ప్రయత్నం) చేయడం, కలహం, దురద, జూదం, మద్యం, పరస్త్రీలు, ఆహారం, మైథునం, నిద్ర, ఇవి సేవిస్తూన్న కొలదీ వృద్ధి చెందుతాయి.

-- సంస్కృత సూక్తి రత్నకోశః (ద్వితీయా మఞ్జూషా) సంకలనం తాత్పర్యం చ డా.పుల్లెల శ్రీరామచంద్రః

Monday, December 5, 2011

గీతా జయంతి

కార్తీక అమావాస్య నాడు భగవంతుని చే (దివ్య మైన అలౌకికమైన మార్గంలో) పార్థునకు ఉపదేశించబడి, మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున సంజయుని చేత ధృతరాష్ట్రునికి చెప్పబడి, వేదవ్యాసుల వారి చే పంచమ వేదమైన శ్రీమన్మహాభారత మధ్యంలో గ్రంధస్థం చేయబడి అద్వైతామృతమును వర్షించే అష్ఠాదశాధ్యాయిని ఐన భగవద్గీతకు (భగవత్స్వరూపమైన అంబకు)మానసిక అనుసంధాన సహితంగా నమస్కరించుచున్నాను.


"భగవద్గీతా కించిదధీతా
గంగా జలలవ కణికా పీతా
సకృదపి యేన మురారి సమర్చా
క్రియతే తస్య యమేన న చర్చా"

శ్రీ ఖర నామ సంవత్సరం గీతా జయంతి సందర్భంగా (06-December-2011) కొన్ని పాత టపాలు:

గీతాంభసి స్నానం: http://nonenglishstuff.blogspot.com/2010/07/blog-post.html

గీతాసారం: http://nonenglishstuff.blogspot.com/2009/12/essence-of-gita.html

యోగవేదాంత: http://prasad-yoga.blogspot.com/

Friday, December 2, 2011

విధి ఉక్త ధర్మము

గృహస్థ విధ్యుక్త ధర్మములు

బ్రహ్మనిష్ఠో గృహస్థస్యాత్ బ్రహ్మజ్ఞానపరాయణః
యద్యద్ కర్మ ప్రకుర్వీత తద్బ్రహ్మణి సమర్పయేత్ 

ब्रह्मनिष्ठो गृहस्थस्यात् ब्रह्मज्ञानपरायणः
यद्यद् कर्म प्रकुर्वीत तद्ब्रह्मणि समर्पयेत्  - 23

The householder should be devoted to God; the knowledge of God should be his goal of life. Yet he must work constantly, perform all his duties; he must give up the fruits of his actions to God.

మహానిర్వాణతంత్రము, అష్టమోల్లాసము నుంచి
Duties of Householder: (The ashTama ullasa of mahAnirvANa tantra has been refereed by Swami VivekAnanda in his speech. Verse 23 till 67 have been explained in the link below.)


http://en.wikisource.org/wiki/The_Complete_Works_of_Swami_Vivekananda/Volume_1/Karma-Yoga/Each_is_great_in_his_own_place 

Performing one's own duties leads to highest good for individual as well as the society. swadharma acharaNa is the core of karma yoga. 

Friday, November 25, 2011

శివ తత్త్వం


నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు
నాలోన గల శివుడు నీలోన గల శివుడు లోకమ్ములేలగలడు
కోరితే సొకమ్ముబాపగలడు...((నాలోన))

నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు గంగపైకెత్తగలడు పాపులను తుంగలో తొక్కగలడు((నాలోన))

నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు కొండపై ఉండగలడు వరమిచ్చి గుండెలో పండగలడు((నాలోన))

నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు ఒద్దంటే రెంటినీ మూయగలడు((నాలోన))

నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు సగము పంచీయగలడు తిక్కతో అసలు తుంచేయగలడు((నాలోన))

నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు మనలోన కలవగలడు దయతోటి తనలోన కలపగలడు((నాలోన))

నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు 
నాలోన గల శివుడు నీలోన గల శివుడు నాటకాలాడగలడు 
తెరదించి మూటగట్టేయగలడు(౩)

-- శ్రీ తనికెళ్ళ భరణి గారి అనుభూతి నుంచి జారిన తత్త్వం..
 శివ తత్త్వాన్ని జానపద పరిభాషలో పోలి స్వర్గం, పోలాల అమావాస్య సందర్భంగా
(ఇదే తత్త్వాన్ని మొన్న వేసిన జీవన్ముక్తానందలహరీ అనే టపా లో దేవ భాష లో చూశాం)

Wednesday, November 23, 2011

జీవన్ముక్తానందలహరీ

శంకర భగవత్పాదులు సనాతనధర్మాన్ని పునరుద్ధరించడానికి వైదికమైన ప్రవృత్తి నివృత్తి మార్గాలను సమన్వయ పరచి గీతా భాష్యాన్నీ, సూత్ర, ఉపనిషద్ భాష్యాలనూ ప్రస్తుత తరానికి అందించారు. దానితో పాటు ఏకశ్లోకి మొదలుకొని ఉపదేశ సహస్రి వరకూ ప్రకరణ గ్రంధాలను బ్రహ్మ తత్త్వాన్ని ధనాత్మకంగాను మిధ్యను ఋణాత్మకంగాను వర్ణిస్తూ వివిధ రకాలైన సాధకులకు ఉపయోగ పడే విధంగా అద్భుతమైన శైలిలో నిర్మించారు. 


కొద్ది రోజుల క్రితం అనాత్మశ్రీవిగర్హణం అనే ప్రకరణం లో ఋణాత్మకంగా వేటికి విలువ లేదో చెప్పిన చిన్న ప్రకరణమును చూచిన తరువాత, ధనాత్మకంగా జీవన్ముక్తుని ఆనందాన్ని తెలియజెప్పే ప్రకరణం ఇది.  



జీవన్ముక్తావస్థ కేవలం తాపత్రయ నివారణం మాత్రం కాదు. అదొక అఖండ అమృతానంద లహరి. పరంపరానుగతం గా సద్గురువుల చేత నిరంతరాయంగా ప్రస్ఫుటం చేయబడే ఆ ఆనందలహరి జగద్గురువుల పదాల్లో:   



पुरे पौरान्पश्यन्नरयुवतिनामाकृतिमयान
सुवेषान्स्वर्णालङ्करणकलितांश्चित्रसदृशा
 .
स्वयं साक्षाद्दृष्टेत्यपि च कलयंस्तैः सह रमन
मुनिर्न व्यामोहं भजति गुरुदीक्षाक्षततमाः .. १..

वने वृक्षान्पश्यन्दलफलभरान्नम्रसुशिखान
घनच्छायाच्छन्नान्बहुलकलकूजद्द्विजगणान .
भजन्घस्रोरात्रादवनितलकल्पैकशयनो
मुनिर्न व्यामोहं भजति गुरुदीक्षाक्षततमाः .. २..

कदाचित्प्रासादे क्वचिदपि च सौधेषु धनिनां
कदा काले शैले क्वचिदपि च कूलेषु सरिताम .
कुटीरे दान्तानां मुनिजनवराणामपि वसन
मुनिर्न व्यामोहं भजति गुरुदीक्षाक्षततमाः .. ३..

क्वचिद्बालैः सार्धं करतलजतालैः सहसितैः
क्वचित्तारुण्यालङ्कृतनरवधूभिः सह रमन .
क्वचिद्वृद्धैश्चिन्ताकुलित हृदयैश्चापि विलपन
मुनिर्न व्यामोहं भजति गुरुदीक्षाक्षततमाः .. ४..

कदाचिद्विद्वद्भिर्विविदिषुभिरत्यन्तनिरतैः
कदाचित्काव्यालंकृतिरसरसालैः कविवरैः .
कदाचित्सत्तर्कैर्रनुमितिपरस्तार्किकवरैर
मुनिर्न व्यामोहं भजति गुरुदीक्षाक्षततमाः .. ५..

कदा ध्यानाभ्यासैः क्वचिदपि सपर्यां विकसितैः
सुगंधैः सत्पुष्पैः क्वचिदपि दलैरेव विमलः .
प्रकुर्वन्देवस्य प्रमुदितमनाः संनतिपरो
मुनिर्न व्यामोहं भजति गुरुदीक्षाक्षततमाः .. ६..

शिवायाः शंभोर्वा क्वचिदपि च विष्णोरपि कदा
गणाध्यक्षस्यापि प्रकटितवरस्यापि च कदा .
पठन्वै नामालिं नयनरचितानन्दसरितो
मुनिर्न व्यामोहं भजति गुरुदीक्षाक्षततमाः .. ७..

कदा गङ्गाम्भोभिः क्वचिदपि च कूपोत्थसलिलैः
क्वचित्कासारोत्थैः क्वचिदपि सदुष्णैश्च शिशिरैः .
भजन्स्नानं भूत्या क्वचिदपि च कर्पूरनिभया
मुनिर्न व्यामोहं भजति गुरुदीक्षाक्षततमाः .. ८..

कदाचिज्जागर्त्यां विषयकरणैः संव्यवहरन
कदाचित्स्वप्नस्थानपि च विषयानेव च भजन .
कदाचित्सौषुप्तं सुखमनुभवन्नेव सततं
मुनिर्न व्यामोहं भजति गुरुदीक्षाक्षततमाः .. ९..

कदाप्याशावासाः क्वचिदपि च दिव्याम्बरधरः
क्वचित्पञ्चास्योत्थां त्वचमपि दधानः कटितटे .
मनस्वी निःसङ्गः सुजनहृदयानन्दजनको
मुनिर्न व्यामोहं भजति गुरुदीक्षाक्षततमाः .. १०..

कदाचित्सत्त्वस्थः क्वचिदपि रजोवृत्तिसुगत\-
स्तमोवृत्तिः क्वापि त्रितयरहितः क्वापि च पुनः .
कदाचित्संसारी श्रुतिपथविहारी क्वचिदहो
मुनिर्न व्यामोहं भजति गुरुदीक्षाक्षततमाः .. ११..

कदाचिन्मौनस्थः क्वचिदपि च वाग्वादनिरतः
कदाचित्स्वानंदं हसितरभसस्त्यक्तवचनः .
कदाचिल्लोकानां व्यवहृतिसमालोकनपरो
मुनिर्न व्यामोहं भजति गुरुदीक्षाक्षततमाः .. १२..

कदाचिच्छक्तीनां विकचमुखपद्मेषु कमलं
क्षिपंस्तासां क्वापि स्वयमपि च गृह्णन्स्वमुखतः .
तदद्वैतं रूपं निजपरविहीनं प्रकटयन
मुनिर्न व्यामोहं भजति गुरुदीक्षाक्षततमाः .. १३..

क्वचिच्छैवैः सार्थं क्वचिदपि च शाक्तैः सह वसन
कदा विष्णोर्भक्तैः क्वचिदपि च सौरैः सह वसन .
कदा गाणापत्यैर्गतसकलभेदोऽद्वयतया
मुनिर्न व्यामोहं भजति गुरुदीक्षाक्षततमाः .. १४..

निराकारं क्वापि क्वचिदपि च साकारममलं
निजं शैव रूपं विविधगुणभेदेन बहुधा .
कदाश्चर्यं पश्यन्किमिदमिति हृष्यन्नपि कदा
मुनिर्न व्यामोहं भजति गुरुदीक्षाक्षततमाः .. १५..

कदा द्वैतं पश्यन्नखिलमपि सत्यं शिवमयं
महावाक्यार्थानामवगतिसमभ्यासवशतः .
गतद्वैताभासः शिव शिव शिवेत्येव विलपन
मुनिर्न व्यामोहं भजति गुरुदीक्षाक्षततमाः .. १६..

इमां मुक्तावस्थां परमशिवसंस्थां गुरुकृपा\-
सुधापाङ्गावाप्यां सहजसुखवाप्यामनुदिनम .
मुहुर्मज्जन्मज्जन्भजति सुकृतैश्चेन्नरवरः
तदा त्यागी योगी कविरिति वदन्तीह कवयः .. १७..

इति श्रीमत्परमहंसपरिव्राजकाचार्यस्य
श्रीगोविन्दभगवत्पूज्यपादशिष्यस्य
श्रीमच्छङ्करभगवतः कृतौ
जीवन्मुक्तानन्दलहरी सम्पूर्णा ..




పురే పౌరాన్పశ్యన్నరయువతినామాకృతిమయాన్
సువేషాన్స్వర్ణాలఙ్కరణకలితాంశ్చిత్రసదృశాన్ .
స్వయం సాక్షాద్దృష్టేత్యపి చ కలయంస్తైః సహ రమన్
మునిర్న వ్యామోహం భజతి గురుదీక్షాక్షతతమాః .. ౧..


వనే వృక్షాన్పశ్యన్దలఫలభరాన్నమ్రసుశిఖాన
ఘనచ్ఛాయాచ్ఛన్నాన్బహులకలకూజద్ద్విజగణాన్ .
భజన్ఘస్రోరాత్రాదవనితలకల్పైకశయనో
మునిర్న వ్యామోహం భజతి గురుదీక్షాక్షతతమాః .. ౨..


కదాచిత్ప్రాసాదే క్వచిదపి చ సౌధేషు ధనినాం
కదా కాలే శైలే క్వచిదపి చ కూలేషు సరితామ .
కుటీరే దాన్తానాం మునిజనవరాణామపి వసన్
మునిర్న వ్యామోహం భజతి గురుదీక్షాక్షతతమాః .. ౩..


క్వచిద్బాలైః సార్ధం కరతలజతాలైః సహసితైః
క్వచిత్తారుణ్యాలఙ్కృతనరవధూభిః సహ రమన్ .
క్వచిద్వృద్ధైశ్చిన్తాకులిత హృదయైశ్చాపి విలపన్
మునిర్న వ్యామోహం భజతి గురుదీక్షాక్షతతమాః .. ౪..


కదాచిద్విద్వద్భిర్వివిదిషుభిరత్యన్తనిరతైః
కదాచిత్కావ్యాలంకృతిరసరసాలైః కవివరైః .
కదాచిత్సత్తర్కైర్రనుమితిపరస్తార్కికవరైర
మునిర్న వ్యామోహం భజతి గురుదీక్షాక్షతతమాః .. ౫..


కదా ధ్యానాభ్యాసైః క్వచిదపి సపర్యాం వికసితైః
సుగంధైః సత్పుష్పైః క్వచిదపి దలైరేవ విమలః .
ప్రకుర్వన్దేవస్య ప్రముదితమనాః సంనతిపరో
మునిర్న వ్యామోహం భజతి గురుదీక్షాక్షతతమాః .. ౬..


శివాయాః శంభోర్వా క్వచిదపి చ విష్ణోరపి కదా
గణాధ్యక్షస్యాపి ప్రకటితవరస్యాపి చ కదా .
పఠన్వై నామాలిం నయనరచితానన్దసరితో
మునిర్న వ్యామోహం భజతి గురుదీక్షాక్షతతమాః .. ౭..


కదా గఙ్గామ్భోభిః క్వచిదపి చ కూపోత్థసలిలైః
క్వచిత్కాసారోత్థైః క్వచిదపి సదుష్ణైశ్చ శిశిరైః .
భజన్స్నానం భూత్యా క్వచిదపి చ కర్పూరనిభయా
మునిర్న వ్యామోహం భజతి గురుదీక్షాక్షతతమాః .. ౮..


కదాచిజ్జాగర్త్యాం విషయకరణైః సంవ్యవహరన్
కదాచిత్స్వప్నస్థానపి చ విషయానేవ చ భజన .
కదాచిత్సౌషుప్తం సుఖమనుభవన్నేవ సతతం
మునిర్న వ్యామోహం భజతి గురుదీక్షాక్షతతమాః .. ౯..


కదాప్యాశావాసాః క్వచిదపి చ దివ్యామ్బరధరః
క్వచిత్పఞ్చాస్యోత్థాం త్వచమపి దధానః కటితటే .
మనస్వీ నిఃసఙ్గః సుజనహృదయానన్దజనకో
మునిర్న వ్యామోహం భజతి గురుదీక్షాక్షతతమాః .. ౧౦..


కదాచిత్సత్త్వస్థః క్వచిదపి రజోవృత్తిసుగత\\-
స్తమోవృత్తిః క్వాపి త్రితయరహితః క్వాపి చ పునః .
కదాచిత్సంసారీ శ్రుతిపథవిహారీ క్వచిదహో
మునిర్న వ్యామోహం భజతి గురుదీక్షాక్షతతమాః .. ౧౧..


కదాచిన్మౌనస్థః క్వచిదపి చ వాగ్వాదనిరతః
కదాచిత్స్వానందం హసితరభసస్త్యక్తవచనః .
కదాచిల్లోకానాం వ్యవహృతిసమాలోకనపరో
మునిర్న వ్యామోహం భజతి గురుదీక్షాక్షతతమాః .. ౧౨..


కదాచిచ్ఛక్తీనాం వికచముఖపద్మేషు కమలం
క్షిపంస్తాసాం క్వాపి స్వయమపి చ గృహ్ణన్స్వముఖతః .
తదద్వైతం రూపం నిజపరవిహీనం ప్రకటయన్
మునిర్న వ్యామోహం భజతి గురుదీక్షాక్షతతమాః .. ౧౩..


క్వచిచ్ఛైవైః సార్థం క్వచిదపి చ శాక్తైః సహ వసన్
కదా విష్ణోర్భక్తైః క్వచిదపి చ సౌరైః సహ వసన్ .
కదా గాణాపత్యైర్గతసకలభేదోఽద్వయతయా
మునిర్న వ్యామోహం భజతి గురుదీక్షాక్షతతమాః .. ౧౪..


నిరాకారం క్వాపి క్వచిదపి చ సాకారమమలం
నిజం శైవ రూపం వివిధగుణభేదేన బహుధా .
కదాశ్చర్యం పశ్యన్కిమిదమితి హృష్యన్నపి కదా
మునిర్న వ్యామోహం భజతి గురుదీక్షాక్షతతమాః .. ౧౫..


కదా ద్వైతం పశ్యన్నఖిలమపి సత్యం శివమయం
మహావాక్యార్థానామవగతిసమభ్యాసవశతః .
గతద్వైతాభాసః శివ శివ శివేత్యేవ విలపన్
మునిర్న వ్యామోహం భజతి గురుదీక్షాక్షతతమాః .. ౧౬..


ఇమాం ముక్తావస్థాం పరమశివసంస్థాం గురుకృపా\\-
సుధాపాఙ్గావాప్యాం సహజసుఖవాప్యామనుదినమ .
ముహుర్మజ్జన్మజ్జన్భజతి సుకృతైశ్చేన్నరవరః
తదా త్యాగీ యోగీ కవిరితి వదన్తీహ కవయః .. ౧౭..


ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య
శ్రీగోవిన్దభగవత్పూజ్యపాదశిష్యస్య
శ్రీమచ్ఛఙ్కరభగవతః కృతౌ
జీవన్ముక్తానన్దలహరీ సమ్పూర్ణా ..

--- కార్తీక మాస శివరాత్రి సందర్భంగా.... 



"కదా అద్వైతం పశ్యన్ అఖిలం అపి సత్యం శివ మయం 
మహా వాక్య అర్థానాం అవగతి సం-అభ్యాస వశతః 
గత ద్వైత అభాసః శివ శివ శివ ఇతి ఏవ విలపన్ 
మునిః న వ్యామోహం భజతి గురుదీక్షాక్షతతమాః  "

See 
http://kamakoti.org/shlokas/kshlok23.htm 
for English. 

Monday, November 21, 2011

మానవ జీవిత పరమావధి


25 సంవత్సరాల క్రితం, శ్రీ క్షయ నామ సంవత్సర కార్తీక బహుళ ఏకాదశి (ఉత్పత్తి ఏకాదశి) రోజున, నేను 8 రూపాయలకి "కర్మ యోగము" అనే పుస్తకమును శ్రీ రామకృష్ణ మిషన్ వారి ప్రచురణల నుంచి కొని చదవటం ప్రారంభించాను.  ఆ పుస్తకం  కర్మ యోగము మీద శ్రీ వివేకానందుల ప్రసంగాల సంకలనం.

మానవ జీవితమునకు అర్థమేమిటి? అనే ప్రశ్న కలగడమే అదృష్టం. దానికి సరైన సమాధానం దొరకడం ఇంకా కష్టం.

25 సంవత్సరాల తరువాత ఈ శ్రీ ఖర నామ సంవత్సర ఉత్పత్తి ఏకాదశి నాడు "కర్మ యోగము" నుంచి ఒక తెలుగు వాక్యం మరియు ఒక సంస్కృత వాక్యం :

1. "మానవ జీవిత పరమావధి సుఖము కాదు; జ్ఞానము. " 
2. "ఆత్మనో మోక్షార్థం జగద్ధితాయ చ" 

జీవులన్నీ కూడా సుఖము కొరకే జీవిస్తూన్నవి. ఆ సుఖ లాలస లో అమృతానంద కారకమైన ఆత్మ "జ్ఞానము" ను సంపాదించే ప్రయత్నము చేయుటకు అనుకూలమైన బుద్ధి జీవుని జన్మ మానవ జన్మ.

మోక్ష కారకమైన ఆత్మజ్ఞానము కొరకు సాధన చేస్తూ జగత్తు హితము కొరకు పాటుపడటమే మానవ జీవిత పరమార్థం

ఈ రెండు వాక్యాలూ నా ఆలోచనలను నడిపిన దారిలో నా కోసం నేను రాసుకున్న (బ్)లాగు పొస్టులు. -
1.   know thy self
2.   yOga vEdAnta
3.   plain truths

-- ఈ శ్రీ ఖర నామ సంవత్సర  కార్తీక బహుళ ఏకాదశి, చివరి కార్తీక సోమవారం సందర్భంగా


Thursday, November 10, 2011

త్రిపురాసుర సంహారం

శరి యై కార్ముకి యై మహాకవచి యై సన్నాహి యై వాహి యై
సరథుం డై సనియంత యై సబలు డై సత్కేతనచ్ఛత్త్రు డై
పరమేశుండొక బాణమున్ విడిచె తద్బాణానలజ్వాలలం
బురముల్ గాలె ఛటచ్ఛటధ్వని నభో భూమధ్యముల్ నిండగన్ 


-- శ్రీమదాంధ్ర భాగవతము, సప్తమ స్కంధము, త్రిపురాసుర సంహార ఘట్టం నుంచి కార్తీక పూర్ణిమ సందర్భంగా

The Story: 

One upon a time, there lived a daemon named tArakAsura. He was killed by kArikEya the son of Lord Shiva in the war. This tArakAsura has three children named vidyunmAli, tArakAksha and kamalAksha. Their mothem took them to pAtALa after the death of tArakAsura. They grew up in due course of time and performed a severe penance. When lord Brahma appeared in front of them they have asked as follows.

"We need three cities made of Gold, Silver and Iron and each city should have all wonderful facilities to live and enjoy. These cities will orbit around in their own orbits and they come into a straight line once in 1000 divine years. They can only be destroyed if someone who can hit them with an arrow which was unknown to be an arrow earlier at that time of they coming in conjugation."

Having got the above boon from lord Brahma, they have occupied the three cities and started ruling over the world like dictators. People were put to all sort of troubles by these tripurAsuras. They have conquered all the Gods as well in the battle.

All the gods went to Lord Shiva and requested him to solve the problem. Lord Shiva taken earth as the chariot, Sun and Moon as the wheels, Lord Brahma as charioteer, mount Meru as the bow, Ananta as the bow-string, Lord NarayaNa as the arrow and smashed the three cities in one single shot when they come in to straight line. Thereby Lord Shiva earned the name as "purAri" and tripurAntaka. 


What is the yogic meaning of this story?
The waking, dreaming and deep sleep that are dominated by three gunas/qualities sattva, rajas and tamas respectively are the three cities of white, golden and dark colors. These three puras will never come to one line as when one dominates the other two are not come into experience.These three states of existence cause a ocean of samsaara of repeated deaths and births for the embodied beings.

They will come into a straight line when the jeeva (none other than Siva) assimilates all the equipment in the body of chariot, the backbone (meru) as the bow, life force (ananta) as the string, Lord Vishnu (the consciousness which spreads all through - concentrated towards the aim of attaining moksha) as arrow, correctly identifies the conjugation point of three states of existence in deep meditation and hits them all in ONE SHOT. Thereby one attains the Kaivalya i.e., the transcendental independence from the dictatorship of tripurasuras i.e, GuNas!!

This final kaivalya is the moksha; one who attains it is the purAri or Siva himself!!!

This event happened on the kaartika poornima day which is today. Hence sharing this story.

om tat sat

My blog on assimilating all the required instruments to carryout tripurasura samhaara : http://prasad-yoga.blogspot.com/

Monday, November 7, 2011

పాహి పాహి జగన్మోహన కృష్ణ

కీర్తన (నాదనామక్రియ, చాపు)

పాహి పాహి జగన్మోహన కృష్ణ పరమానంద శ్రీకృష్ణ

దేవకీవసుదేవనందన కృష్ణ దివ్యసుందర శ్రీకృష్ణ
నందయశోదానందన కృష్ణ ఇందువదన శ్రీకృష్ణ
కుందరవదనకుటిలాలక కృష్ణ మందస్మిత శ్రీకృష్ణ
కింకిణిరచితఘణంఘణ కృష్ణ క్రీడాలోల శ్రీకృష్ణ
కుంకుమపంకవిపంకిల కృష్ణ గూఢమహిమ శ్రీకృష్ణ
చంచలఝళఝళనూపుర కృష్ణ మంజుళవేష శ్రీకృష్ణ
తరళితకుండలమండిత కృష్ణ తాండవలోల శ్రీకృష్ణ
ధిక్కృతసురరిపుమండల కృష్ణ దీనపాలక శ్రీకృష్ణ
సాధుసాధు నటవేష కృష్ణ సత్యసంధ శ్రీకృష్ణ
పాలితనారాయణతీర్ధ కృష్ణ పరమపావన శ్రీకృష్ణ (పాహి పాహి) 04-04

-- శ్రీ నారాయణతీర్ధ విరచిత శ్రీకృష్ణలీలాతరంగిణి -చతుర్థ తరంగం నుంచి
(క్షీరాబ్ధి ద్వాదశి సందర్భంగా )

Audio: http://www.maganti.org/audiofiles/air/songs/nkm4.html

ఈ రోజు కార్తీక సోమవారం కూడా. శ్రీ నారాయణ తీర్ధుల వారిదే ఇంకొక కీర్తన (శివ, కేశవ ప్రియం కార్తీకమాసం)

శివ శివ భవ భవ శరణం మమ భవతు సదా తవ స్మరణం

గంగాధర చంద్ర చూడ జగన్మంగల సర్వలోకనీడ ...1
కైలాసాచలవాస శివ కర పురహర దరహాస ...2
భస్మోద్ధూళిత దేహశంభో పరమ పురుష వృషవాహ ...3
పంచానన ఫణిభూష శివ పరమ పురుష మునివేష ...4
ఆనందనటన వినోద సచిదానంద విదలిత ఖేద ...5
నవవ్యాకరణ స్వభావ శివ నారాయణతీర్థ దేవ ...6

Monday, October 24, 2011

నరక చతుర్దశి

భూదేవీ స్వరూపమైన సత్యభామ మెరుపుతీగ వలే నరకుని పై బాణ వర్షం కురిపించిన సన్నివేశము పోతన గారి మాటల్లో:
జ్యావల్లీ ధ్వని గర్జనంబుగ సురల్ సారంగయూథంబుగా
నా వి ల్లింద్రశరాసనంబుగ సరోజాక్షుండు మేఘంబుగా
దా విద్యుల్లతభంగి నింతి సురజి ద్దావాగ్ని మగ్నంబుగా
బ్రావృట్కాలము సేసె బాణచయ మంభ శ్శీకరశ్రేణి గాన్

ఏకకాలమందు అమ్మ శృంగార వీర రసాలలో హరికి, అరికి (నరకాసురునికి) ఇలా కనిపించింది:
రాకేందు బింబమై రవిబింబమై యొప్పు నీరజాతేక్షణ నెమ్మొగంబు
కందర్ప కేతువై ఘన ధూమకేతువై యలరు బూబోణి చేలాంచలంబు
భావజు పరిధియై ప్రళయార్కు పరిధియై మెరయు నాకృష్టమై మెలతచాప
మమృత ప్రవాహమై యనల సందోహమై తనరారు నింతి సందర్శనంబు

హర్షదాయి యై మహారోష దాయి యై పరగు ముద్దరాలి బాణవృష్టి
హరికి నరికి– జూడ నందంద శృంగార వీరరసము లోలి విస్తరిల్ల.

అటువంటి తల్లి కరుణా కటాక్ష వీక్షణాలు ప్రపంచం లోని జనులందరి మీదా ఉండాలని ఆశిస్తూ ఆది శంకరుల కనకధార నుంచి ఒక శ్లొకం: 
కమలే కమలాక్ష వల్లభే త్వం
కరుణా పూరతరంగితైరపాంగైః
అవలోకయ మామకించనానాం
ప్రథమం పాత్రమకృతిం దయాయాః

 --- గోవత్స ద్వాదశి, ధన త్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి అమావాస్య....

Friday, October 21, 2011

యః క్రియవాన్ సపండితః


पठकाः पाठकाश्चैव येचान्ये शास्त्र चिंतकाः
सर्वे व्यसनिनो मूढाः यः क्रियवान् सपंडितः

పఠకాః పాఠకాశ్చైవ యేచాన్యే శాస్త్ర చింతకాః
సర్వే వ్యసనినో మూఢాః యః క్రియవాన్ సపండితః

(కేవలం చదివే వారు, చదివించేవారు, శాస్త్రచింతన చేసేవారు మూఢులు. అనుష్ఠానము చేసే క్రియాశీలుడు మాత్రమే పండితుడు)

People who are simply studying, simply teaching and simply thinking of "saastras" are simply wasting time. One who practices (the teaching of saastra) is wise.

Sunday, October 16, 2011

రామ

రామో రాజమణిః సదా విజయతే రామం రమేశం భజే
రామేణాభిహతా నిశాచరచమూ రామాయ తస్మై నమః
రామాన్నాస్తి పరాయణం పరతరం రామస్య దసోsస్మ్యహం
రామే చిత్తలయః సదా భవతు మే భో రామ మాముద్ధర

1. రామో రాజమణిః సదా విజయతే
2. రామం రమేశం భజే
3. రామేణాభిహతా నిశాచరచమూ
4. రామాయ తస్మై నమః
5. రామాన్నాస్తి పరాయణం పరతరం
6. రామస్య దసోsస్మ్యహం
7. రామే చిత్తలయః సదా భవతు మే
8. భో రామ మాముద్ధర 

-- రామ శబ్దం - ఏ విభక్తిలోఐనా.....


Tuesday, October 11, 2011

వాల్మీకి జయంతి


కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం
ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం

వాల్మీకేర్మునిసిమ్హస్య కవితావనచారిణః
శ్రుణ్వన్ రామ కధానాదం కొనయాతి పరాం గతిం?

-- వాల్మీకి జయంతి సందర్భంగా

Sunday, October 9, 2011

అనాత్మశ్రీవిగర్హణమ్

||అనాత్మశ్రీవిగర్హణమ్ || 

లబ్ధావిద్యా రాజమాన్యా తతః కిం ప్రాప్తాసమ్పత్ప్రాభవాఢ్యా తతః కిమ్ |
భుక్తానారీ సున్దరాఙ్గీ తతః కిమ్ యేనస్వాత్మా నైవ సాక్షాత్కృతోSభూత్ ||౧||

కేయూరాద్యైర్భూషితోవా తతః కిం కౌశేయాద్యైరావృతోవా తతః కిమ్ |
తృప్తోమృష్టాన్నాదినా వా తతః కిం యేనస్వాత్మా నైవ సాక్షాత్కృతోSభూత్ ||౨||

దృష్టానానా చారుదేశాస్తతః కిం పుష్టాశ్చేష్టాబన్ధువర్గాస్తతః కిమ్ |
నష్టందారిద్ర్యాదిదుఃఖం తతః కిం  యేనస్వాత్మా నైవ సాక్షాత్కృతోSభూత్ ||౩||

స్నాతస్తీర్థేజహ్నుజాదౌ తతః కిం దానందత్తం ద్వ్యష్టసంఖ్యం తతః కిమ్ |
జప్తామన్త్రాః కోటిశో వా తతః కిం యేనస్వాత్మా నైవ సాక్షాత్కృతోSభూత్ ||౪||

గోత్రంసమ్యగ్భూషితం వా తతః కిం గాత్రంభస్మాచ్ఛాదితం వా తతః కిమ్ |
రుద్రాక్షాదిఃసద్ధృతో వా తతః కిమ్ యేనస్వాత్మా నైవ సాక్షాత్కృతోSభూత్ ||౫||

అన్నైర్విప్రాస్తర్పితావా తతః కిం యజ్ఞైర్దేవాస్తోషితావా తతః కిమ్ |
కీర్త్యావ్యాప్తాః సర్వలోకాస్తతః కిం యేనస్వాత్మా నైవ సాక్షాత్కృతోSభూత్ ||౬||

కాయఃక్లిష్టశ్చోపవాసైస్తతః కిం లబ్ధాఃపుత్రాః స్వీయపత్న్యాస్తతః కిమ్ |
ప్రాణాయామఃసాధితో వా తతః కిం యేనస్వాత్మా నైవ సాక్షాత్కృతోSభూత్ ||౭||

యుద్ధేశత్రుర్నిర్జితో వా తతః కిం భూయోమిత్రైః పూరితో వా తతః కిమ్ |
యోగైఃప్రాప్తాః సిద్ధయో వా తతః కిం యేనస్వాత్మా నైవ సాక్షాత్కృతోSభూత్ ||౮||

అబ్ధిఃపద్భ్యాం లఙ్ఘితో వా తతః కిం వాయుఃకుమ్భే స్థాపితో వా తతః కిమ్ |
మేరుఃపాణావుద్ధృతో వా తతః కిం యేనస్వాత్మా నైవ సాక్షాత్కృతోSభూత్ ||౯||

క్ష్వేలఃపీతో దుగ్ధవద్వా తతః కిం వహ్నిర్జగ్ధోలాజవద్వా తతః కిమ్ |
ప్రాప్తశ్చారఃపక్షివత్ఖే తతః కిం యేనస్వాత్మా నైవ సాక్షాత్కృతోSభూత్ ||౧౦||

బద్ధాఃసమ్యక్పావకాద్యాస్తతః కిం సాక్షాద్విద్ధాలోహవర్యాస్తతః కిమ్ |
లబ్ధోనిక్షేపోSఞ్జనాద్యైస్తతః కిం యేనస్వాత్మా నైవ సాక్షాత్కృతోSభూత్ ||౧౧||

భూపేన్ద్రత్వంప్రాప్తముర్వ్యాం తతః కిం దేవేన్ద్రత్వంసమ్భృతం వా తతః కిమ్ |
ముణ్డీన్ద్రత్వంచోపలబ్ధం తతః కిం యేనస్వాత్మా నైవ సాక్షాత్కృతోSభూత్ ||౧౨||

మన్త్రైఃసర్వః స్తమ్భితో వా తతః కిం బాణైర్లక్ష్యోభేదితో వా తతః కిమ్ |
కాలజ్ఞానంచాపి లబ్ధం తతః కిం యేనస్వాత్మా నైవ సాక్షాత్కృతోSభూత్ ||౧౩||

కామాతఙ్కఃఖణ్డితో వా తతః కిం కోపావేశఃకుణ్ఠితో వా తతః కిమ్ |
లోభాశ్లేషోవర్జితో వా తతః కిం యేనస్వాత్మా నైవ సాక్షాత్కృతోSభూత్ ||౧౪||

మోహధ్వాన్తఃపేషితో వా తతః కిం జాతోభూమౌ నిర్మదో వా తతః కిమ్ |
మాత్సర్యార్తిర్మీలితావా తతః కిం యేనస్వాత్మా నైవ సాక్షాత్కృతోSభూత్ ||౧౫||

ధాతుర్లోకఃసాధితో వా తతః కిం విష్ణోర్లోకోవీక్షితో వా తతః కిమ్ | 
శంభోర్లోకఃశాసితో వా తతః కిం యేనస్వాత్మా నైవ సాక్షాత్కృతోSభూత్ ||౧౬|| 

యస్యేదంహృదయే సమ్యగనాత్మశ్రీవిగర్హణమ్ | 
సదోదేతిస ఏవాత్మసాక్షాత్కారస్య భాజనమ్ ||౧౭|| 

అన్యేతు మాయికజగద్భ్రాన్తివ్యామోహమోహితాః | 
నతేషాం జాయతే క్వాపి స్వాత్మసాక్షాత్కృతిర్భువి ||౧౮|| 

ఇతిశ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య శ్రీగోవిన్దభగవత్పూజ్యపాదశిష్యస్య శ్రీమచ్ఛఙ్కరభగవతఃకృతౌ అనాత్మశ్రీవిగర్హణప్రకరణంసంపూర్ణమ్ ||


ఆత్మ సాక్షాత్కారము అనే "శ్రీ" కలగనప్పుడు, అనాత్మ "శ్రీ" ఎంత ఉన్నా ఏం లాభం?
ఆత్మ సాక్షాత్కారం కాక, బ్రహ్మ లోకాన్ని సాధించి ఏం ప్రయోజనం? విష్ణు లోకాన్ని వీక్షించి ఏం ప్రయోజనం? శంభు లోకాన్ని శాశించి ఏం ప్రయోజనం?

ఇక ఈ భూ లొకం లోని చంచలమైన "సంపద, ఆడంబరాల"  గురించి వేరే చెప్పాలా?

Monday, October 3, 2011

శాకంభరీ

गीर्देवतेति गरुडध्वजसुन्दरीति
शाकम्भरीति शशिशेखरवल्लभेति ।
सृष्टिस्थितिप्रलयकेलिषु संस्थितायै
तस्यै नमस्त्रिभुवनैकगुरोस्तरुण्यै ॥  (From Kanakadhaara Stotram)

గీర్దేవతే ఇతి; గరుడధ్వజ సుందరీ ఇతి
శాకంభరీ ఇతి; శశిశేఖర వల్లభే ఇతి;
సృష్టి స్థితి ప్రలయ కేళి సుసంస్థితాయై;
తస్మై నమః త్రిభువనైక గురొః తరుణ్యైః (కనకధారా స్తొత్రం నుంచి)

గీర్దేవత ఐన వాణిగా సృష్టి లోనూ; గరుదధ్వజుని భార్యగా, దుర్గమాసురుని సంహరించిన శాకంభరీ దేవిగా స్థితిలోనూ; శశిశేఖర వల్లభ గా ప్రలయ కేళి లోనూ సుసంస్థిత గా ఉన్న, త్రిభువనములకు గురువై ఉన్న పరమాత్మ తరుణి ఐన పరాశక్తి కొరకు నమస్కారము.

-- దుర్గాష్టమి సందర్భంగా
(ఈ శ్లోకం లో "శాకంభరీతి" అన్న ప్రయోగమూ, "త్రిభువనైకగురోస్తరుణ్యై" అన్న పద ప్రయోగమూ అవగతం కావాలంటే ఎంతో కొంత ధ్యానం చేయవలసిందే!)

Friday, September 23, 2011

వ్రాత ప్రతులు

మా అమ్మగారు స్వహస్తాలలో రాసుకున్న "గీతా సందేశము"

మా మేనమామ శ్రీ బాచిమంచి శ్రీహరి శాస్త్రి గారు రామప్రభూ అనే మకుటంతొ ఒక శతకాన్ని రచించారు. దానిలోనుంచి మా మాతామహులు మరియు మాతామహి గూర్చిన రెండు పద్యాలు వారి స్వహస్తాలతో మా అమ్మకి రాసి ఇవ్వగా అవి ఇలా ఈ బ్లాగులోకి



-- పితృ పక్షమైన మహాలయ పక్షం లో వచ్చే ఏకాదశి సందర్భంగా, పరమపదించిన పెద్దలను తలచుకుంటూ




Posted by Picasa

Friday, September 16, 2011

చింత

మాత్రా సమం నాస్తి శరీరపోషణం
విద్యాసమం నాస్తి శరీర భూషణం
భార్యాసమం నాస్తి శరీరతోషణం
చిన్తాసమం నాస్తి శరీరశోషణం
తల్లివలె శరీరాన్ని పోషించేది మరేదీ లేదు. విద్యతో సమానమైన శరీర అలంకారం లేదు. భార్య వలే శరీరానికి సౌఖ్యం కలిగించేది మరొకటి లేదు. చింత వలే శరీరాన్ని ఎండపెట్టేదీ లేదు.

చిన్తా చితాసమా హ్యుక్తా బిన్దుమాత్రవిశేషతః
సజీవం దహతే చిన్తా నిర్జీవం దహతే చితా
ఒక్క ం తేడాతో చింత, చిత సమానమైనవి. చిత చనిపోయిన శరీరాన్ని కాలుస్తుంది. చింత బతికిఉండగానే కాలుస్తుంది. 

అందుకే 
చిన్తా నాస్తి కిల
తేషాం - చిన్తా నాస్తి కిల

శమ దమ కరుణా సమ్పూర్ణానాం
సాధు సమాగమ సంకీర్ణానాం || చిన్తా ||
పరమహంసగురు పద చిత్తానాం
బ్రహ్మానన్దామృత మత్తానామ్ || చిన్తా ||

-- శ్రీ సదాశివ బ్రహ్మేన్ద్ర విరచితా "చిన్తా నాస్తి కిల" 

అంతరింద్రియములను, బహిరింద్రియములను పూర్తిగా అదుపులో ఉంచుకొన్నవారికి - సజ్జన సంగతియందు కాలము గడుపువారికి దుఃఖము లేదు! చింతలేదు! 
పరమహంసలైన శ్రీ గురువులపాదములయందు తమ్ముతామర్పించుకొన్న వారికి బ్రహ్మానందామృతపానముచే తమ్ము దా మరచువారికి చింత ఏమున్నది? శోకమే మున్నది?

పరమహంసగురు పద చిత్తానాం బ్రహ్మానన్దామృత మత్తానామ్ చిన్తా నాస్తి కిల తేషాం - చిన్తా నాస్తి కిల! 
http://www.maganti.org/audiofiles/air/songs/mbk/chintanastikila.html

Thursday, September 15, 2011

జిహ్వ, ప్రమాణం

జిహ్వే ప్రమాణం జానీహి భాషణే భొజనేపి చ
అత్యుక్తిరతిభుక్తిశ్చ సత్యం ప్రాణాపహారిణీ
jihvE pramaaNaM jaanIhi bhaaShaNE bhojanE..pi cha
atyuktiratibhuktishca satyaM praaNaapahaariNI

జిహ్వే  ప్రమాణం  జానీహి  భాషణే  భొజనే అపి చ
అతి ఉక్తిః అతి భుక్తిః చ సత్యం ప్రాణ అపహారిణీ

ఓ నాలుకా, నీ మితి ని తెలుసుకో, భోజనానికీ, భాషణానికీ కూడా.  అతి భాషణ, అతి భోజనాలు ప్రాణాలను అపహరించగలవు. 

O Tongue! know your limits with respect to both "talking" and "eating." For,  or over talking or over eating both could kill!





Saturday, September 10, 2011

మనుష్యుల అనుష్ఠానం

అనుష్ఠితం తు యద్దేవైరృషిభిర్యదనుష్ఠితం
నానుష్ఠేయం మనుష్యైస్తు తదుక్తం కర్మ ఆచరేత్

అనుష్ఠితం తు యత్ దేవైః  ఋషిభిః యత్ అనుష్ఠితం
న అనుష్ఠేయం మనుష్యైః తు తత్ ఉక్తం కర్మ ఆచరేత్

anushThitaM tu yat dEvai@H  Rshibhi@h yat anushThitam
na anushThEyaM manushyai@h tu tat uktam karma AcarEt

దేవతలు చేసిన పనులు, ఋషులు చేసిన పనులు మనుష్యులు చేయగూడదు. వాళ్ళు చెప్పినట్లు మాత్రమే చెయ్యాలి.

Human beings should not try to imitate the actions of Devas and Rishis. Mankind should only follow the teachings of them.




Thursday, September 1, 2011

గణనాథపరాక్రమము

अलसा कृपणा दीना निद्रा तंद्रा प्रमीलिका
क्लीबा च निरहंकारा चेत्यस्टौ दॆवताः स्मृताः

అలసా కృపణా దీనా నిద్రా తంద్రా ప్రమీలికా
క్లీబా చ నిరహంకారా చేత్యస్టౌ దెవతాః స్మృతాః

శ్రీబ్రహ్మాణ్డపురాణే ఉత్తరభాగే హయగ్రీవాగస్త్యసంవాదే లలితొపాఖ్యానే గణనాథపరాక్రమో నామ సప్తవింశో 'ధ్యాయః 

సోమరితనం (अलसा), దిగులు (दीना), బేలతనం(कृपणा), నిద్ర(निद्रा), కునుకు(तंद्रा), కర్తవ్యం దాకా వచ్చి వెనుదిరగడం(क्लीबा), సంకోచము (प्रमीलिका), తనపై తనకే నమ్మకం లేకపోవడం (निरहंकारा) ఈ ఎనిమిదీ విఘ్న శక్తులు.

విశుక్రుడు అనే రాక్షసుడు ఈ ఎనిమిది శక్తులు గల "జయవిఘ్నశిల" అనే యంత్రాన్ని ప్రయోగించగా, విఘ్నేశ్వరుడు ఆ యంత్రాన్ని నిర్వీర్యం చేయడంచేత దేవతలలో అగ్రపూజ్యుడయ్యాడు

More on: http://online.eenadu.net/Editorial/Antaryamiinner.aspx?qry=010911anta

-- వినాయక చవితి సందర్భంగా

Wednesday, August 31, 2011

అవిద్య, జడ, దరిద్ర, జన్మ జలధిలో మునిగిన వారికి తారణోపాయం

अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी
जडानां चैतन्यस्तबकमकरन्दस्रुतिझरी ।
दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ
निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति ॥

అవిద్యానామన్తస్తిమిరమిహిరద్వీపనగరీ,
జడానాం చైతన్యస్తబకమకరన్దస్రుతిఝరీ ।
దరిద్రాణాం చిన్తామణిగుణనికా,
జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి ॥

The "spek of dust" at your lotus feet becomes:
The island-city of rising Suns, for the ignorant;
The stream of ever flowing Nectar of the cluster-of-consciousness-flowers, for the unconsciousness (dull-witted) beings;
The string of chintaamanis (the jewel grants the wishes), for the destitute;
The tusk of Varaha Avataara (that lifted the earth from drowning), for those submerged in the ocean of births (and deaths)

-- From Saundarya laharI (Third sloka) of Samkara Bhagavatpaada.
(on the occasion of Gauri tritiya and Varaha Jayanti)

Saturday, August 27, 2011

కాలము - మహిమలు

సీ|| ఘనుని హరిశ్చంద్రు కాటికాపరి చేసె
మురసుతు సార్వభౌమునిగ సలిపె
అల రంతిదేవుని అన్నాతురుగా జేసె
పేద కుచేలు కుబేరు జేసె
ధర్మాత్ము బలిని పాతాళమునకు దొక్కె
కలుషాత్ము నహుషు స్వర్గమునకెత్తె

కాలమున ఇట్టి మహిమలు కలవియవుట
మానవుడు మేను విడచిన మరుదినము కాక
సుగుణ దుర్గుణములు కలిమి లేములు
ఎన్నరాదని వచియింతురెల్ల బుధులు.


-- కవి కాళ్లకూరి నారాయణరావు రచించిన చింతామణి నాటకం నుంచి (బిల్వమంగళుడు, రాధ తో)
మా అమ్మ ఈ పద్యాన్ని ఇతరుల మంచి చెడ్డలను గూర్చి ప్రస్తావన వచినప్పుడు అప్పుడప్పుడూ ఉటంకిస్తూ ఉండే వారు.

Monday, August 22, 2011

కృష్ణాష్టమి

करारविन्देन पदारविन्दं
मुखारविन्दे विनिवेशयन्तम्
वटस्य पत्रस्य पुटे शयानं
बालं मुकुन्दं मनसा स्मरामि
కరారవిందములతో పదారవిందమును ముఖారవిందమందు ఉంచుకున్న వటపత్ర శయనుడైన బాల ముకుందుని మనసారా స్మరిస్తున్నాను.

कृष्ण त्वदीय पदपङ्कजपङ्जरान्ते
अद्यैव मे विशतु मानसराजहंसः
प्राणप्रयाण समये कफवातपित्तैः
कन्ठावरोधनविधौ स्मरणं कुतस्ते
కృష్ణా, నా మానసమనే రాజహంసను నీ పదారవింద పంజరమునందు ఇప్పుడే ప్రవేశపెట్టవలెను. ప్రాణ ప్రయాణ సమయమునందు కఫ, వాత, పిత్తముల వలన కంఠమునకు అవరోధము వచ్చినపుడు నీ స్మరణం ఎలా కుదురుతుంది?

--- కృష్ణాష్టమి సందర్భంగా
More logical kRshNa tattva from my old blog post: http://plaintruthsfromprasad.blogspot.com/2009/08/internal-dimension-of-microcosm.html

Sunday, August 7, 2011

మైత్రీ - Friendship

आरम्भ गुर्वी क्षयणी क्रमेण लघ्वी पुरा वृद्धिमती च पश्चात्
दिनस्य पूर्वार्थ परार्थभिन्ना छायेव मैत्री खलसज्जनानाम्
దుర్మార్గుల స్నేహం పగటి పూర్వార్థంలో (సూర్యోదయం నుంచి మిట్ట మధ్యాహ్నం వరకు ఉండే) నీడ లాంటిది, ప్రారంభం లో పెద్దగా ఉంటుంది, క్రమంగా క్షీణిస్తుంది. సజ్జనుల స్నేహం పగటి ఉత్తరార్ధం లో నీడ వంటిది, ప్రారంభంలో చిన్నదిగా ఉంటుంది, క్రమంగా పెద్దది అవుతుంది.
ārambha gurvī kṣayaṇī kramēṇa laghvī purā vr̥ddhimatī ca paścāt
dinasya pūrvārtha parārthabhinnā chāyēva maitrī khalasajjanānām

आपत्काले तु सम्प्राप्ते यन्मित्रं मित्रमेव तत्
वृद्धिकाले तु सम्प्रप्ते दुर्जनोऽपि सुहृद्भवेत्
ఆపదలలో కూడా మిత్రుడుగా ఉన్నవాడే నిజమైన మిత్రుడు. అభివృద్ధిలో ఉన్నప్పుడు దుర్జనుడు కూడా మిత్రుడౌతాడు.
āpatkālē tu samprāptē yanmitraṁ mitramēva tat
vr̥ddhikālē tu sampraptē durjanō'pi suhr̥dbhavēt

-- Happy Friendship day!

Tuesday, August 2, 2011

పరతంత్రం

కాలో హి బలవాన్ కర్తా సతతం సుఖ దుఃఖయోః |
నరాణాం పరతంత్రాణాం పుణ్య పాపానుయోగతః ||

కాలమనే బలమైన కర్త నరుల పుణ్య పాప అనుగతంగా, పరతంత్రముగా ఎల్లప్పుడూ సుఖ దుఃఖ ములను కలుగజేయుచున్నాడు.
(కాలము అంటే మన పుణ్యమునకు తగిన సుఖాన్నీ, పాపమునకు తగిన దుఃఖాన్నీ తప్పకుండా తగిన సమయంలో కలిగించే ఎదురులేని బలవంతుడైన కర్త.)

--దేవీ భాగవతం నుంచి

kAlO hi balavAn kartA satatam sukha du@hkhayO@h
narANAM paratantrANAM puNyapApAnuyOgata@h

kaala alone is the most powerful karta, who always dispenses the sukha and duhkha to beings based on their punya and paapa. In this matter of sukha and duhka, human being is helplessly dependent (paratantra) on his own punya and paapa.

-- From dEvI bhAgavatM

Thursday, July 14, 2011

గురు పరంపర

ఓం నారాయణం పద్మభవం వసిష్ఠం
శక్తిం చ తత్పుత్ర పరాశరం చ
వ్యాసం శుకం గౌడపాదం మహాంతం
గొవింద యోగీంద్ర మధస్య శిష్యం
శ్రీ శంకరాచార్య మధస్య శిష్యం
పద్మ పాదం చ హస్తామలకం చ
తం తొటకం వార్తికకార మన్యాన్
అస్మద్ గురూన్ సంతతం మానతోస్మి
From Hamsa Ashram 2010

-- గురు పూర్ణిమ సందర్భంగా (ఆషాఢ శుద్ధ పూర్ణిమ)

Om nArAyaNam padmabhavam vasishTham
Saktim cha tatputra parASaram cha
vyAsam Sukam gowDapAdam mahAntam
govinda yOgIndra madhasya Sishyam
SrI SankarAchArya madhasya Sishyam
padma pAdam cha HastAmalakam cha
tam toTakam vArtika kAra manyAn
asmad gurUn santatam mAnatOsmi

-- Guru poornima

Krishna Panchakam:
Sri Krishna and four others, namely Sanatkumara, Sanaka, Sanandana and Sanatsujata consist of Krishna Panchaka. Sri Krishna is placed in the centre and others to the east, south, west and north of Lord Sri Krishna.

Vyasa Panchakam:
Veda Vyasa Bhagavan is placed in the centre. His four disciples namely Sumanthu, Jaimini, Vaisampayana and Paila are placed in the four quarters to the east, south, west and north of Vyasa respectively.

Sankaracharya Panchakam:
Sri Sankara Bhagavadpada is placed in the middle and His four sishyas, namely, Padmapadacharya, Sureswaracharya, Totakacharya and Hastamalakacharya are placed in the four directions.

Let the grace of Jagadgurus be on one and all.

Tuesday, July 12, 2011

తేనెటీగ - కూడబెట్టుట

తల్లిగర్భమునుండి ధనము తేడెవ్వడు
వెళ్లిపోయెడినాడు వెంటరాదు
లక్షాధికారైన లవణ మన్నమె కాని
మెఱుగు బంగారంబు మ్రింగబోడు
విత్త మార్జనజేసి విఱ్ఱవీగుటె కాని
కూడబెట్టిన సొమ్ము తోడరాదు
పొందుగా మఱుగైన భూమిలోపల బెట్టి
దానధర్మము లేక దాచి దాచి

తుదకు దొంగల కిత్తురో దొరల కవునొ
తేనె జుంటీగ లియ్యవా తెరువరులకు?
భూషణవికాస! శ్రీధర్మ పురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర!


--శేషప్ప కవి విరచిత నరసింహ శతకం నుంచి
http://nonenglishstuff.blogspot.com/2011/05/blog-post_16.html

Wednesday, July 6, 2011

shaTpadI - షట్పదీ

జగద్గురువుల కవిత్వం
అవినయమపనయ విష్ణో దమయ మనః శమయ విషయమృగతృష్ణాం
భూతదయాం విస్తారయ తారయ సంసారసాగరతః

దివ్యధునీమకరందే పరిమలపరిభోగసచ్చిదానందే
శ్రీపతిపదారవిందే భవభయఖేదచ్ఛిదే వందే

సత్యపి భేదాపగమే నాథ తవాహం న మామకీనస్త్వం
సాముద్రో హి తరంగః క్వచన సముద్రో న తారంగః

ఉద్ధృతనగ నగభిదనుజ దనుజకులామిత్ర మిత్రశశిదృష్టే
దృష్టే భవతి ప్రభవతి న భవతి కిం భవతిరస్కారః

మత్స్యాదిభిరవతారైరవతారవతాSవతా సదా వసుధాం
పరమేశ్వర పరిపాల్యో భవతా భవతాపభీతోSహం

దామోదర గుణమందిర సుందరవదనారవింద గోవింద
భవజలధిమథనమందర పరమం దరమపనయ త్వం మే

నారాయణ కరుణామయ శరణం కరవాణి తావకౌ చరణౌ
ఇతి షట్పదీ మదీయే వదనసరోజే సదా వసతు

ఇతి శ్రీమద్ శంకరాచార్యవిరచితం విష్ణుషట్పదీస్తోత్రం సంపూర్ణమ్

నా పైత్యం
హే విష్ణో, అవినయం అపనయ, దమయ మనః, శమయ విషయ మృగతృష్ణాం, భూతదయా విస్తారయ, తారయ సంసార సాగరతః
ఆగంతకముగా నాలోకి వచ్చిన "అవినయము" (అహంకారము, గర్వము)ను పారద్రోలుము. విషయములనే ఎండమావులను శాంతింపజేయుము. మనస్సును కళ్ళెము వేయుము. నాలో కొంచెముగా ఉన్న భూతదయను విస్తరించుము (ప్రతివారికీ తనవారి మీద దయ ఉంటుంది. దాన్ని విస్తరిస్తే వసుధైక కుటుంబమే!) నన్ను ఈ సంసారమనే సా+గరము (గరము అంటే విషము; సాగరము అంటే విషముతో కూడినది అని అర్ధము) నుండి తరింపుము. (నిన్ను నువ్వు ఉద్ధరించుకోలేవా? అంటే - అదివచ్చి నన్ను పట్టుకుంది, లేదా నేను అందులో పడి పోయాను. అందువలన నాకు ఒక ఆలంబనను లేదా నౌక లాంటి దానిని నీవే ఇవ్వ వలసి ఉంటుంది. )

వందే! శ్రీ పతి పదారవిందే, దివ్య ధునీ మకరందే, పరిమళ పరిభోగ సచ్చిదానందే, భవ భయ ఖేద చ్చిదే
దివ్య ధునీ అయిన మందాకిని అనే మకరందము గలవీ (త్రివిక్రమ లీల) , ఎంత అనుభవించినా తనివితీరని (పరిభోగము నకు అనువైన) పరిమళము గలిగినవీ, ఈ సంసారమందు కలుగు భయమునూ ఖేదమునూ ఛేదించ గలిగినవీ అయిన శ్రీపతి (మనకు అన్ని భోగాలనూ ఇచ్చే భూమి నుంచి వచ్చే సంపదకు "శ్రీ" అని పేరు) పదారవిందములకు నేను వందనము చేయు చున్నాను.

హే నాథ! సత్య అపి బేధ అపగమే తవ అహం న మామకీ నః త్వం; సాముద్రో హి తరంగః క్వచన సముద్రో న తారంగః
ఓ నాథా, " నీవు", "నేను" అనే బేధం పోయి పరమార్థ సత్యం దర్శనం వరకూ నేను నీయందే ఉన్నాను (తవ అహం) కానీ ఎప్పుడూ నీవు నావాడవు (మాత్రమే) కావు. అది ఎలాగంటే, ఎల్లప్పుడూ తరంగాలన్నీ సముద్రానివే కానీ సముద్రమెప్పుడూ ఏ ఒక్క తరంగానిదీ కాదు కదా!

కిం న భవతి భవ తిరస్కారః ? భవతి దృష్టే ప్రభవతి, హే ఉధృతనగ, నగభిత్ అనుజ, దనుజ కుల అమిత్ర, మిత్ర శశి దృష్టే!
ఓ కొండను ఎత్తిన వాడా (గోవర్ధన ఉద్ధారణ లీల - ఇంద్రుని గర్వం అణచి న సందర్భం) , కొండల శత్రువైన ఇంద్రుని తమ్ముడిగా పుట్టి అన్నకు రాజ్యమిప్పించినవాడా (వామన అవతార లీల) , ఓ రాక్షస కులమునకు శత్రువైన వాడా (రామావతార లీల) ఓ సూర్య చంద్రులు కళ్ళ గా కలిగినవాడా ( ఎల్లప్పుడూ అన్ని జీవులనూ గమనించే వాడా!) నీ కృపా దృష్టి నా మీదకు ప్రభవిస్తే ఈ సంసార తిరస్కారము ఎందుకు జరగదు? (వైరాగ్యం వచ్చి తీరుతుంది అని సమాధానము!!)

హే పరమేశ్వరా! భవతా పరిపాల్యో అహం భవ తాప భీతః; అవతారవతా మత్స్య ఆదిభిః అవతారైః అవతా సదా వసుధాం!

మత్స్యము మొదలైన అవతారాలను ధరించి (చిన్న చేపను కాపాడిన రాజును ప్రళయ కాలం లో కాపాడుతూ, ఎకకాలంలో వేదోద్ధరణం చేసిన లీల) పాప భారం ఎక్కువైపోయిన భూదేవిని ఎప్పటికప్పుడు కాపాడుతూ ఉండే నువ్వు ఓ పరమేశ్వరా నేను కూడా భవ తాపం తో భీతి చెంది ఉన్నానాయ్యా (నాలోనే పుట్టిన పాపపు ఆలోచనలను నిగ్రహించలేకుండా ఉన్నానయ్యా!) నన్నూ అదే విధం గా పరిపాలించ వయ్యా పరమేశ్వరా (పరమేశ్వర అనే నామం శివునకు సంబంధిచినదైనా, శివ కేశవ అబేధం వల్ల ఇక్కడ అన్వయిస్తుంది )

హే దామోదర, గుణమందిర, సుందర వదనారవింద, గొవిందా! భవ జలధి మథన మందర! త్వం మే పరమం దరం అపనయ
ఓ దామోదరా (పరబ్రహ్మమై ఎవరికి చిక్కని వాడివి, యశొదమ్మ చేత చిక్కి దామము లో ఉదరము ను బంధింపబడిన వాడవై - భక్త సులభుడవైన లీల) అన్ని గుణములకూ మందిరమైన వాడా! (తెల్లని సూర్య కాంతి నుంచి సప్త సప్తి మరీచులు లెక్క లేనన్ని రంగులు / గుణములు ఎల వస్తాయో అయినాప్పటికీ సూర్య కాంతి ఎలా నిర్గుణ మైనదో) ఎల్లప్పుడూ చూడాలనిపించే సుందర వదనారవిందము కలవాడా (సౌందర్యం లో రక్షకత్వం ఉంటుంది) ఓ గోవిందా (జగద్గురు తత్త్వం; శంకరాచార్యుల గురు స్వరూపం కూడా గోవిందుడే!) ఈ భవ జలధిని మధించ దానికి మందర పర్వతం లాగా, కవ్వం గా నాకు సహాయం చేస్తున్నవాడా! పరమమైన భయమైన మృత్యు భయమును నానుంచి దూరము చేయవయ్యా! (అంటే జ్ఞానము ప్రసాదించ మని ప్రార్ధన!!)

నారాయణా, కరుణామయా, నీ చరణములయందు శరణడిగిన నా వదన సరోజమునందు ఈ షట్పది (తుమ్మెదను) ఎల్లప్పుడూ నివసించునట్లు చేయి.
(నా మాటలలనే పద్మాలలో భక్తి అనే మకరందాన్ని తుమ్మెద రూపం లో ఎల్లప్పుడూ ఆస్వాదించు స్వామీ; అది నన్ను తరింప జేస్తుంది అని భావము)

-- భగవంతుని నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల వలన బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి ప్రవచనము ద్వారా నేననే ఈ తోలు తిత్తికి గల కర్ణ రంధ్రములలో ప్రవేశించి జగద్గురువు శంకర భగవద్పాదుల వాణి మదీయ గురుచరణుల వైభవాన్ని ఆవిష్కరించింది.

ప్రతి జిజ్ఞాసువూ తన జీవిత కాలం లో ఒక్కసారి భావపూర్వకంగా ఈ స్తొత్రం తో ధ్యానము చేస్తే జీవిత పరమార్థమైన మోక్షం లభించి తీరుతుంది.

Wednesday, June 29, 2011

హృదయకపి

సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ
నటత్యాశాశాఖాస్వటతి ఝటితి స్వైరమభితః |
కపాలిన్ భిక్షో మే హృదయకపిమత్యంతచపలం
దృఢం భక్త్యా బద్ధ్వా శివ భవదధీనం కురు విభో ||

-- శివానందలహరి

అత్యంత చపలమైన నా హృదయ కపి ఎల్లప్పుడూ మోహారణ్యంలో యువతుల కుచ గిరులపైన తిరుగుతూ, ఆశా శాఖలను (ఊడలనూ) పట్టుకుని ఊగుతూ, స్వైర విహారం చేస్తొంది. ఓ శివా, నీవు కపాలివి, భిక్షుడవు; ధృఢమైన భక్తి అనే బంధనం తో దీనిని బంధించి నీ అధీనం చేసుకోవయ్యా! (ఈ కోతి నీ వెనకాల తిరుగుతూ ఉంటే ఉపయోగం గా ఉంటుందేమో! దీనిని నేనే పట్టి నీకప్పగించే శక్తి నాకు లేదు!! స్వామీ శరణు!!!)

ఇదే భావాన్ని భక్త రామదాసు:
పరుల ధనంబుఁజూచిపర భామలజూచి హరింపగోరు మ
ద్గురుతరమానసం బనెడు దొంగనుబట్టినిరూఢదాస్య వి
స్ఫురితవివేక పాశములఁ జుట్టి భవచ్చరణంబనే మరు
త్తరువునగట్టివేయగ దె దాశరథీ కరుణాపయోనిధీ.

ధూర్జటి:
తమకొం బొప్పఁ బరాంగనాజనపర ద్రవ్యంబులన్ మ్రుచ్చిలం
గ మహోద్యోగము సేయనెమ్మనముదొంగం బట్టి వైరాగ్యపా
శములం జుట్టి బిగియించి నీదుచరణ స్తంభంజునం గట్టివై
చి ముదం బెప్పుడుఁ గల్గఁజేయ గడవే శ్రీ కాళహస్తీశ్వరా!

Tuesday, June 21, 2011

నా భూషణములు

నిను సేవింపగ నాపదల్ వొడమనీ నిత్యోత్సవం బబ్బనీ
జనమాత్రుండననీ మహాత్ము డననీ సంసారమోహంబు పై
కొననీ జ్ఞానము గల్గనీ గ్రహగతుల్ గుందింపనీ మేలువ
చ్చిన రానీ యవి నాకు భూషణములే శ్రీ కాళహస్తీశ్వరా!

--ధూర్జటి శ్రీ కాళహస్తీశ్వర శతకము నుంచి

నిను సేవింపగ నాపదల్ వొడమనీ,
నిత్యోత్సవం బబ్బనీ,
జనమాత్రుండననీ,
మహాత్ము డననీ,
సంసారమోహంబు పైకొననీ,
జ్ఞానము గల్గనీ,
గ్రహగతుల్ గుందింపనీ,
మేలువచ్చిన రానీ,
యవి నాకు భూషణములే శ్రీ కాళహస్తీశ్వరా!
(అన్ని ద్వంద్వాలూ నాకు భూషణములే; భూమికి ఉత్తరార్ధ గోళం లో అతి దీర్ఘమైన రోజు June 21st సందర్భంగా!)

Friday, June 17, 2011

భక్తార్భకుని రక్షణ

ఆనన్దాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతశ్ఛాదనం
వాచా శంఖ ముఖే స్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతైః ।
రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో రక్షాం భవద్భావనా
పర్యంకే వినివేశ్య భక్తి జననీ భక్తార్భకం రక్షతి ।।

ఆనన్ద అశ్రుభిః ఆతనోతి పులకం నైర్మల్యతః ఛాదనం
వాచా శంఖముఖే స్థితైః చ జఠరా పూర్తిం చరిత్ర అమృతైః
రుద్రాక్షైః భసితేన దేవ వపుషః రక్షాం భవద్ భావనా
పర్యంకే వినివేశ్య భక్తి జననీ భక్త అర్భకం రక్షతి

ఓ దేవా , భక్తి అనే తల్లి భక్తుడైన అర్భకుడిని ఇలా రక్షిస్తుంది:
ఆనందాశృవులతో పులకింపజేస్తూ, నిర్మలత్వం అనే బట్టలు కట్టి, నీ చరిత్రామృతమును మాటలనే ఉగ్గుగిన్నె తో పోసి ఆకలి తీర్చుతూ, రుద్రాక్ష భస్మములచేత శరీరాన్ని రక్షిస్తూ, నీ భావనా ధ్యానమనే ఊయల లో ఉంచి భక్తుడు అనే బాలుడిని భక్తి అనే జనని రక్షిస్తుంది.

-- శివానందలహరి నుంచి

(ఇటువంటి తల్లి రక్షణ లో ఉన్న మనకెందుకింక భయం?)

Wednesday, June 15, 2011

ఏకత్వం, భిన్నత్వం

कृष्णो भोगी शुकः त्यागी जनको राजकार्यकृत्
दत्तो वेश्यासुरासक्तः विष्णुमक्तस्तु नारदः
लीला स्वपतिरक्ता च कर्कटी पिशिताशना
इतिहास पुराणानां कर्ता व्यासो महान् ऋषिः
ज्ञानमेकं तु सर्वेषां कर्म तेषां पृथक् पृथक्

-- గురువులు రకరకాల కర్మల్లోనూ కనిపించినా వారందరి లోని జ్ఞానం ఒక్కటే!
(జ్ఞానం ఎల్లప్పుడూ ఏకత్వమే, కర్మ ఎప్పుడూ భిన్నత్వమే)

Saturday, June 11, 2011

రామేశ్వరం ఏ సమాసం?

విష్ణుస్తత్పురుషం బ్రూతే బహువ్రీహిం మహేశ్వరః
ఉభయో రప్యతృప్తానా మాత్మభూః కర్మధారయమ్‌

-- దశ పాపహర దశమి, శ్రీరామ చంద్ర మూర్తి రామేశ్వరం లో ప్రతిష్ఠించిన రోజు

రామేశ్వరం ఏ సమాసం? తత్‌ పురుషమా? "రామస్యఈశ్వరః అని అంటే రామునికి ఈశ్వరుడు ప్రభువు- అని అర్థం ఏర్పడుతుంది. అపుడు అది శివాధిక్యం చెపుతుంది. శివుని విల్లు విరిచిన రాముడు శివునికంటె ఏ విధంగా తక్కువ? సర్వలోక శరణ్యుడు రాముడు. అతనికి పైన ఇంకో ఈశ్వరుడా? ఈసందేహాలన్నీ తీర్చెవా రెవరు? వారు విష్ణుమూర్తినే అడిగి చూడామని అనుకొని వైకుంఠం వెళ్ళారు. "ఇంత చిన్న విషయానికి ఇంతదూరం ఎందుకు వచ్చారు? ఈ పదాన్ని చూస్తేనే తెసుస్తున్నదే తత్పురుష అని. రామస్య ఈశ్వరః అని. విష్ణుమూర్తి దేవతలతో అన్నాడట. కాని దేవతలకు మాత్రం సందేహనివృత్తి కాలేదు.

విష్ణువు నడిగాం సరిగదా, ఇక ఆ శివుణ్ణే అడుగుదాం, ఆయన ఏంచెప్తాడో చూదాం అని అనుకొని "విష్ణు స్తత్పురుషం బ్రూతే" అని అనుకొంటూ కైలాసానికి వెళ్ళగా, శివుడు "ఇందులో సందేహానికి అవకాశం ఏముందయ్యా? రామేశ్వర పదం బహువ్రీహిసమాసం రాముడే ఈశ్వరుడుగా గలవాడు రామేశ్వరుడు' అని ఆయన బదులు చెప్పాడట.

దేవతలకు ఏమీ తోచింది కాదు. వ్యాకరణ విషయంలో శివకేశవులకు ఈలాటి భేదాభిప్రాయాలు కలుగుతవని దేవతలకు కలలోనయినా తోచలేదు. "వీరిద్దరికి పేరుతో ప్రసక్తి ఉన్నందున వేరే మధ్యవర్తిని అడిగి సందేహం తొలగించుకొందామని "బహువ్రీహిం మహేశ్వరః" శివుడుబహువ్రీహీ సమాసం అని చెప్పుకొంటూ బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళారట.

బ్రహ్మదేవతలకు కలిగిన సందేహాన్ని జరిగినసమచారాన్నీ శాంతంగావిని "ఇది తత్పురుషసమాసము కాదు, బహువ్రీహిన్నీ కాదు, మరి కర్మధారయసమాసం, వీరరాఘవు డంటే వీరుడు ఒకడూ రాఘవుడు మరొకడూనా? కాదుగదా? ఆలాగే రామేశ్వరు డంటే రాము డొకడూనూ ఈశ్వరుడింకోడూనా? రాముడే యీశ్వరుడు, ఈశ్వరుడే రాముడు అని అర్థం. కాగా "రామశ్చాసావీశ్వరశ్చ" రామేశ్వరః అని కర్మధారయమే యిది అని తీర్పు చేశారుట బ్రహ్మగారు.

-- జగద్గురు బోధలు నుంచి

Thursday, June 9, 2011

విజయసూత్రం

యస్య త్వేతాని చత్వారి వానరేంద్ర యథా తవ
ధృతిర్దృష్టిర్మతిర్దాక్ష్యం స కర్మసు న సీదతి

198. vaanarendra= O best among Vanaras! yasya= whoever, dhR^itiH= ( has) courage, dR^ishhTiH= vision, matiH= intellect, daakshyam= skill, etaani= (all) these, chatvaari= four (virtues), tava yathaa= like you, saH= that (him), na siidati= will not fail, karmasu= in (any) tasks.

"O best among Vanaras! Whoever has the four qualities of courage, vision, intellect and skill, all these four virtues like you, such a person will not fail in any task."


ధృతిఃదృష్టిః మతిః దాక్ష్యం స కర్మసు నసీదతి.

1. ధృతి - పట్టుదల. ఎట్టి పరిస్థితులలోనూ సడలని ప్రయత్నమే ధృతి.
2. దృష్టి - ఏకాగ్రత, పనియొక్క పరిపూర్ణతను ముందుగా దర్శించగలగడం. దీనినే దార్శనికత అనవచ్చు.
3. మతి - బుద్ధిబలం - ప్రణాళిక రచన (ప్లానింగ్‌) చక్కగా ఆలోచించడం.
4. దాక్ష్యం - (దక్షత) సమర్థత. పనికి తగిన శరీర, బుద్ధుల పనితీరు.
ఈ నాలుగూ ఎవరికి ఉంటాయో విజయం వారినే వరిస్తుంది.

- వాల్మీకి రామాయణము సుందరకాండ మొదటి సర్గ నుంచి

Tuesday, May 31, 2011

రాముడు, శివుడు

కృతాభిషేకస్స రరాజ రామః
సీతా ద్వితీయాస్సహ లక్ష్మణేన |
కృతాభిషేకోతు అగరాజ పుత్ర్యా
రుద్రస్స నందిర్భగవానివేశః || 43

కృత, అభిషేకః, స, రరాజ, రామః
సీతాద్వితీయాః, సహ, లక్ష్మణేన |
కృత, అభిషేకః, తు, అగ-రాజ-పుత్ర్యా
రుద్రః, స, నందిః, భగవాన్, ఇవ, ఈశః ||

43. siitaa dvitiiyaH=Seetha, as second-half [along with]; saH raamaH= that, Rama; kR^ita abhiSekaH= on making [having taken,] river bath; saha lakSmaNena= with Lakshmana; aga raaja putryaa= with mountain, king's, daughter [Paarvati]; kR^ita abhiSekaH= making [having taken,] sacred bath, but; sa nandiH= one with Nandi, the Holy Bull; iishaH bhagavaan rudraH iva= all-controlling, god, Rudra [Shiva in fury,] like; raraaja= shone forth.

ఈ విధంగా సీతా, రామ, లక్ష్మణులలో పార్వతీ, శివ, నందులలోని అబేధాన్ని దర్శించారు ఆదికవి!

--వాల్మీకి రామాయణే ఆది కావ్యే అరణ్య కాణ్డే షోడశః సర్గః
(కృష్ణాంగారక చతుర్దశి, మాస శివరాత్రి సందర్భంగా )

Friday, May 20, 2011

సహజ శతృత్వం

शत्रुणा न हि संदध्यात् सुश्लिष्टेनापि संधिना।
सुतप्तमपि पानीयं शमयत्येव पावकम्।।

సహజ శతృవుతో (నిప్పు - నీటితో) ఎంత జాగ్రత్త తో కూడినదైనా, సంధి చేయకూడదు. ఎంత కాచిన నీరైనా అగ్నిని ఆర్పివేస్తుంది (ఆర్పివేయ గలుగుతుంది) కదా!

-- హితోపదేశ మిత్ర లాభం నుంచి

Monday, May 16, 2011

నరసింహ జయంతి

సీ.

జందె మింపుగ వేసి సంధ్య వార్చిన నేమి బ్రహ్మ మందక కాడు బ్రాహ్మణుండు

తిరుమణి శ్రీచూర్ణ గురురేఖ లిడినను విష్ణు నొందక కాడు వైష్ణవుండు

బూదిని నుదుటను బూసికొనిన నేమి శంభు నొందక కాడు శైవజనుడు

కాషాయ వస్త్రాలు గట్టి కప్పిన నేమి యాశ పోవక కాడు యతివరుండు


తే. ఎన్ని లౌకికవేషాలు గట్టుకొనిన

గురుని జెందక సన్ముక్తి దొరకబోదు.

భూషణవికాస! శ్రీధర్మ పురనివాస!

దుష్టసంహార! నరసింహ దురితదూర!


--శేషప్ప కవి విరచిత నరసింహ శతకం నుంచి

Sunday, May 15, 2011

రావణ కుంభ కర్ణులకు రాముడు పుట్టె...

సమస్యా పూరణం: "రావణ కుంభ కర్ణులకు రాముడు పుట్టె గుణాభిరాముడై" అన్న దానికి పూరణ

చేవ నొసంగ జాతికిని జీవ మొసంగగ బండ రాతికిన్
సేవ నొసంగ కోతికిని శిక్ష నొసంగగ చుప్పనాతికిన్
దేవ మునీంద్ర శాపమును దీరిచి ముక్తి నొసంగగా
రావణ కుంభకర్ణులకు; రాముడు పుట్టె గుణాభిరాముడై

మహా కవుల పూరణ లో సమస్య పూర్తిగా కనిపించకుండా పోయింది!

-- "
కరుణశ్రీ" జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి పూరణ

Saturday, May 7, 2011

శంకర జయంతి

शङ्कारूपेण मच्चित्तं पङ्कीकृतमभूद्यया ।
किङ्करी यस्य सा माया शङ्कराचार्यमाश्रये ॥११॥

The tricky Maya that cleverly deludes; And raises storms of dismay in my mind, That illusion is his servant maid; Salutations to Sankaracharya !

-- from श्रीगुरुपरम्परास्तोत्रं

[ Full text on sAradA pITham site. ]


It is the celebration of a birthday of The Birth-less One! "Bhagavan Adi Sankara"

न मृत्युर् न शंका न मे जातिभेद: पिता नैव मे नैव माता न जन्म
न बन्धुर् न मित्रं गुरुर्नैव शिष्य: चिदानन्द रूप: शिवोऽहम् शिवॊऽहम् ॥ (From nirvANa shaTkam)

-- శంకర జయంతి సందర్భంగా

Thursday, May 5, 2011

దండన రహస్యం

దణ్డ్యే యః పాతయేత్ దణ్డం దణ్డ్యో యః చ అపి దణ్డ్యతే |
కార్య కారణ సిద్ధార్థౌ ఉభౌ తౌ న అవసీదతః || 4-18-61

61. yaH= he who; daNDye= regarding the punishable one; daNDam paatayet= punishment, let falls - imposes; yaH ca api= he, who is, even; daNDyaH= is punishable; daNDyate= gets punished; kaarya kaaraNa siddha arthau= effect, cause, accomplished, with means; tau ubhau= those, two; na ava siidataH= will not, sink down - doomed, get condemned.

తత్ భవాన్ దణ్డ సమ్యోగాత్ అస్మాత్ విగత కల్మషః |
గతః స్వాం ప్రకృతిం ధర్మ్యాం ధర్మ దిష్టేన వర్త్మనా || 4-18-62
62. tat= thereby; bhavaan= you are; asmaat daNDa sam yogaat= with this, punishment, by linkage - by virtue of; vi gata kalmaSaH= [you are] completely, divested, of blemish; dharma diSTena vartmanaa= by rightness, given, course - as contained in the scriptures of rightness; dharmyaam= agreeable to righteousness; svaam prakR^itim gataH= your own, nature, you got into - obtained.

---- శ్రీరామచంద్రమూర్తి వాలితో
(by the dharmic way of punishment, the punished one should be brought back into to his true natural state of purity! by doing so, the both punisher and the punished would become accomplished in cause and effect of punishment )

Monday, April 18, 2011

అగ్నిని అగ్ని కాల్చదు

అథవా చారుసర్వాఙ్గీ రక్షితా స్వేన తేజసా
న నశిష్యతి కల్యాణీ నాగ్నిరగ్నౌ ప్రవర్తతే - సుందర కాండ, 55 వ సర్గ, 23వ శ్లోకం

హనుమ లంకాదహనం చేసి, తాను చేసిన అనాలోచితమైన పని వల్ల సీతమ్మకు ఏదైనా ఆపద కలిగిందేమో అని చింతిస్తూ ఇలా అనుకున్నాడు:
సీతను ఆమె తేజస్సే రక్షిస్తూన్నది. మంగళప్రదురాలైన అలాంటి సీత నశించదు. అగ్నిని అగ్ని కాల్చజాలదు కదా!

-- మహా చైత్రీ, శ్రీఖర నామ సంవత్సర చైత్ర శుద్ధ పూర్ణిమ, చిత్రానక్షత్రం, సొమవారం.

Thursday, April 14, 2011

రామాఖ్యం మన్మహే మహః

"వైదేహీవివృతం దివ్యం సచ్చిత్సుఖరసం చ యత్,
వైదేహీవిచితం ధ్యేయం తాపత్రయహరం చ యత్,
వైదేహీసంయుతం ధర్మ్యసంసిద్ధిదం చ యత్,
జ్ఞానధ్యానాధ్వరాప్యం తత్ రామాఖ్యం మన్మహే మహః" 1,2

"ప్రమాతా చ ప్రమాణం చ ప్రమేయం చ ప్రమేతి హ
యదేకం భాతి తత్సర్వం రామాఖ్యం మన్మహే మహః" 3

1,2 : "దివ్యమూ, సచ్చిదానందరూపమూ అయిన ఏ మహాతేజస్సు విదేహముక్తావస్థయందు ఆవిష్కృతం అవుతుందో, ధ్యానింపదగినదీ, త్రివిధతాపవినాశకమూ అయిన ఏ తేజస్సు దేహస్మృతి కూడ లేని నిర్వికల్పసమాధిస్థితిలో అన్వేషింపబడుతుందో వైదేహీదుహితా సహితమూ ధర్మసంరక్షకమూ అయిన ఏ తేజస్సు ధర్మసంమత మైన సిద్ధిని ప్రసాదిస్తుందో, అట్టి 'రామ' అను పేరుతో ఉన్న జ్ఞాన - ధ్యాన - యజ్ఞములచే పొందదగిన మహా తేజస్సును మననం చేయుచునాము."
3: "అద్వితీయమైన ఏ మహాతేజస్సు ప్రమాతగాను, ప్రమాణముగాను, ప్రమేయముగాను, ప్రమగాను భాసిస్తూన్నదో, 'రామ' అను సకలజదాత్మయైన ఆ మహా తేజస్సును మననం చేయుచున్నాము."

-- ఇది మహామహోపాధ్యాయ ఆచార్య డా. పుల్లెల శ్రీరామచంద్రుడు గారి పితృచరణులు బ్రహ్మశ్రీ పుల్లెల సత్యనారాయణ శాస్త్రి గారు రచించి అనుదినమూ బ్రాహ్మీముహుర్తమున వారిచే ఉపాంశుజపమందు అనుసంధానము చేయబడిన శ్రీ రామాద్వైత ప్రతిపాదక శ్లొకత్రయము.
-- ( శ్రీమద్రామాయణామృతతరంగిణిలో మనోభావ లహరీ విలాసాలు అనే గ్రంధం నుంచి )

Monday, April 11, 2011

జానకీపతీ! నిను నమ్మితి, నిన్నే నమ్మితి.

నమ్మితి రామచంద్ర మది నమ్మితి రాజకులేంద్ర మేలుగా
నమ్మితిఁ గీర్తిసాంద్ర కడునమ్మితి దాసచకోరచంద్ర నా
నమ్మిక లేమి చేసెదవొ నమ్మగ నర్హుల గానివారలన్
నమ్మనయా దయాబ్ధివని నమ్మితి నిన్మది జానకీపతీ

వందే నీలసరోజకోమలరుచిం వందే జగద్వందితం
వందే సూర్యకులాబ్ధికౌస్తుభమణిం వందే సురారాధితమ్
వందే సాధకవంచక ప్రహరణం వందే జగత్కారణం
వందే వింశతిపంచతత్త్వరహితం వందే సదా రాఘవమ్

-- స్వస్తి శ్రీ ఖర నామ సవంత్సర శ్రీరామనవమి సందర్భంగా

Sunday, April 10, 2011

అన్యోన్య దాంపత్యం

వరుడు:
హరం సర్పహారం చితాభూవిహారం
భవం వేదసారం సదా నిర్వికారం
శ్మశానే వసంతం మనోజం దహంతం
శివం శంకరం శంభుమీశానమీడే
వధువు:
నానారత్న విచిత్రభూషణకరీ హేమాంబరాడంబరీ
ముక్తాహార విడంబమాన విలసద్వక్షోజ కుంభాంతరీ
కాశ్మీరాగరువాసితాంగ రుచిరా కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

ఇలా వధూవరుల స్వరూపాలు పరస్పర విరుద్ధంగా ఉన్నా "ఆది దంపతులు" ఎలా విడదీయలేకుండా ఉంటారో మహాకవి కాళిదాసు మాటల్లో:
వాగర్థా వివసంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ
యౌ: ఎవరు, వాగర్థావివ: శబ్దార్థములవలె, సంపృక్తౌ: కలిసియుండిరో, జగతః జగతికి, పితరౌ: తలిదండ్రులో, తౌ : ఆ, పార్వతీ పరమేశ్వరౌ : పార్వతిని పరమేశ్వరుని, వాగర్థ ప్రతిపత్తయే : శబ్దార్థములను సరిగా ఎరుగుటకు, వందే : నమస్కరించుచున్నాను.

అలాంటి అన్యోన్య దంపతులు లోకానికి మేలు జరగడం కోసం ఎలా ప్రవర్తిస్తారో పోతన భాగవతం లో:
మ్రింగెడు వాడు విభుండని మ్రింగెడిది గరళమనియు మేలని ప్రజకున్
మ్రింగుమనె సర్వమంగళ మంగళ సూత్రమ్ము నెంతమది నమ్మినదో
ఈ పద్యం లో ముఖ్యంగా క్రింది విషయాలని గమనించాలి.
1. హాలాహలాన్ని వామ హస్తం లో గ్రహించిన శివుడు పార్వతి ఆమోదం కొరకు చూడటం
2. పార్వతీ దేవికి భర్త మీద (మంగళ సూత్రం మీద) గల నమ్మకం
3. ప్రజా హితమైన కార్యం కోసం త్యాగం చేయగలగడం

-- ప్రతీ దంపతుల జంటా ఈ "ఆది దంపతులను" ఆదర్శంగా తీసుకుని జీవిస్తే జగత్తుకు ఎల్లప్పుడూ సర్వ మంగళమే జరుగుతుంది.

Saturday, April 9, 2011

తత్వరహస్యప్రభ

సోపాన పంచకము

వేదోనిత్య మధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం
తేనేశస్య విధీయతా మపచితిః కామ్యేమతి స్త్యజ్య
తాం
పాపౌఘః పరిధూయతాం భవసుఖే దోషో7ను సంధీయతా
మాత్మేచ్ఛావ్యవసీయతాం నిజగృహాత్తూర్ణం వినిర్గమ్యతాం||

సంగస్సత్సునిధీయతాం భగవోతో భక్తి ర్దృఢాధీయతాం
శాంత్యాధాఃప చీయతాం ధృఢతరంకర్మాశు సంత్యజ్యతాం
సద్విద్వాసుపర్ప్యతా మనుదినం తత్పాదుకాసేవ్యతాం
బ్రహ్మేశాక్షంమర్థ్యతాం శృతిశిరోవాక్యం సమాకర్ణ్యతాం||

వాక్యార్థశ్చ విచార్యతాం శృతిశిరఃపక్షస్ససూశ్రియతాం
దుస్తర్కాత్సునిరమ్యతాం శృతిమత స్తర్కో7నుసంధీయతాం.
బ్రహ్మాస్మీతి విభావ్యతా మహరహర్గర్వః పరిత్యజ్యతాం
దేహే7హం యతిరుర్ఘుతాం బుధజనైః వాదస్స ముత్సృజ్యతాం||

క్షుద్వ్యాధిశ్చ చికిత్స్యతా మనుదినం భిక్షాపథం భుజ్యతాం
స్వాద్వన్నం నతుయాచనతాం విధివశాత్ప్రాప్తేన సంతుష్యతాం
ఔదాసీన్య మభీప్స్యతాం జనకృపా నైష్ఠుర్య ముత్సృజ్యతాం
శీతోష్ణాది విషహ్యతాం నతువృధావాక్యం సముచ్చార్యతాం ||

ఏకాంతే సుఖమాస్యతాం పరతరే చేతస్సమాధీయతాం
పూర్ణాత్మాసు సమీక్ష్యతాంజగదిదం తాద్బాధితందృశ్యతాం
ప్రాక్కర్మాపి విలావ్యతాం చితిబలాన్నాప్యుత్తరైశ్ల్శిష్యతాం
ప్రారబ్ధం త్విహభుజ్యతా మధ పరబ్రహ్మాత్మ నాస్థీయతాం ||


శ్రీమద్వైతోపదేశ పంచరత్నములనే సోపాన పంచకస్తోత్రములో మొదటినుండి క్రమముగా ఒకమెట్టు తరువాత మరియొకమెట్టు ఎక్కుటకు వీలుచేసినట్టి సాధన పరంపరను చెప్పిరి. అర్థజ్ఞాన సాధనమైన శాస్త్రముతోసహ వేదమును నిత్యం చదువవలయును. ఆ వేదోక్తకర్మలను ఈశ్వరార్పణ బుద్ధ్యా చేయవలయును. ఇట్టి నిష్కామకర్మవలన జ్ఞాన ప్రతిబంధకమైన పాపములను పోగొట్టుకొనవలయును, తరువాత వైరాగ్యం కొరకే విషయసుఖములను దోషదృష్టితో విడచి పెట్టవలయును. పరమాత్మను తెలుసుకుందామనే జిజ్ఞాసను బలముగా సంపాదించవలయును. విషయములయందు విరక్తుడై, తత్వజిజ్ఞాసకలవాడై యిల్లు (భార్యా పుత్రాదులను వదలి అభిమానమును వదలి) వెళ్లి తత్వ విచారము చేయు మహాత్ములతో సహవాసం చేయవలయును.

దృఢమైన భగవద్భక్తినికూడా సంపాదించవలయును. శమదమాది సంపత్తినికూడా సంపాదించవలయును. కర్మసన్యాసం చేయవలయును. అనగా సన్యసించవలయును, వెనుకటి సామాన్య సజ్జనసాంగత్యము కాక, బ్రహ్మనిష్ఠులైన విద్వాంసులైన సద్గురువులవద్దకు వెళ్లవలయును. వారికి అనుగ్రహం కలిగేటట్లు వారి పాదసేవ చేయవలయును. వారియనుగ్రహం సంపాదించి, బ్రహ్మతత్వమును చెప్పమని యడుగవలెను. వారి వలన వేదాంత వాక్యములను మహావాక్యములను అర్థముతో వినవలయును. అసంభావనా విపరీతభావనలు పొయ్యేంతవరకు మహావాక్యార్థమైన జీవబ్రహ్మైక్యవిచారం చేయవలయును. శృతులకు విరుద్ధమైన మతము లను ఆశ్రయించకుండా శృతిసమ్మతమైన అద్వైతసిద్ధాంతమునే ఆశ్రయించవలయును.

శృతులకు విరుద్ధమైన యుక్తిరూపమగు తర్కమును వదలివేయవలయును. శృతులకు సమ్మతమైన యుక్తులనే గ్రహించవలయును. మననం చేయమని యర్థము. తరువాత, నేను బ్రహ్మస్వరూపుడనని ధ్యానం చేయవలయును. నేను జ్ఞానినికదా యని అహంకారమును వదలి వేయవలయును. దేహేంద్రియములయందు నేననే భ్రమను వదలివేయవలయును. ఇతర మతస్థులైన విద్వాంసులతో వివాదమును వదలుము. నిత్యం భిక్షాటన చేత లభించిన ఆహారముతో ఆకలిని శమింపచేసుకొనుము. అనారోగ్యం కలిగినపుడు ఔషధసేవచేసి శరీరం నిలబెట్టుకొనుము. ఔషధ సేవవలెనే భిక్షాభోజనంకూడా శరీరమును రక్షించుకొనుటకేకాని, భోగప్రధానముగా రుచియైన పదార్థములను కోరకూడదు. లాభాలాభముల యందు సమానబుద్ధితో ప్రవృత్తిలేకుండా ఊరికే ఉండవలయును. తన తత్వనిష్ఠకు ప్రతిబంధకంగా ఎవరియందును దయతోగాని, క్రోధముతో గాని కలుగచేసుకొనవద్దు. శీతోష్ణములను సుఖ దుఃఖములను సహించవలయును. వ్యర్థమైన సంభాషణలేకుండా మౌనము నవలంభించవలయును.

అట్టి మోక్షమును అభ్యసించుటకు నిర్జనప్రదేశమందు (నివసించ) ఉండవలయును. మౌనంగా నుండి పరబ్రహ్మ యందు మనస్సును నిలిపి ధ్యానం చేయవలయును. బ్రహ్మసాక్షాత్కారమును పొందవలయును. బ్రహ్మానుభూతిచేత సకలద్వైత భ్రమను నశింపచేసుకొనవలయును. ఆత్మజ్ఞానంవలన సంచిత కర్మరాశిని దహింపచేయుము. ఆగామిని అంటకుండా వుండుము. ఒక ప్రారబ్ధము మాత్రమే వుండునుగనుక అనుభవించుము. ఆ ప్రారబ్ధం పోయిన తరువాత పరబ్రహ్మరూపముగా నుండును. అని శ్రీశంకర భగవత్పాదులవారు యేస్థితినుండి యేయే స్థితికి వెళ్ళవలయునో యెట్లు ప్రయత్నించవలయునో, యేదిచేస్తే యేస్థితి కలుగునో విశదముగా నుపదేశించిరి.

-- శ్రీ శంకరాచార్య విరచితమగు శ్రీమద్వైతోపదేశ పంచరత్నములనే మరియొక పేరుగల సోపాన పంచకమునకు మద్దులపల్లి మాణిక్యశాస్తిచ్రే రచింపబడిన తత్వరహస్యప్రభ నుంచి

Wednesday, March 30, 2011

తత్త్వ చింతనం

ఉత్తమాతత్త్వ చింతాచ మధ్యమా యోగ చింతనం |
అధమా మంత్ర చింతాచ తీర్థభ్రాంత్యంऽధమాధమః ||

The lowest step is going to holy places. Having visited "tirthas" one gets in touch with holy men and their blessings.
The next better step is "mantra chintanam" - repetition of a mantra. i.e., japa
Even better is practice of yoga.
The Best is the vichara into the tattva i.e., the tattva of oneness!

om tat sat

Friday, March 18, 2011

గురు గీత

यत्सत्तया जगद्सत्वं यत्पकाशेन भायुतम् ।
नंदनं च यदानंदात् तस्मै श्री गुरवे नमः ॥
by which existence the world appears; and by which light the world is bright; and by which bliss the world derives happiness; to that GURU I bow down.

मन्नाथ श्री जगन्नथो मद्गुरु स्त्रिजगद्गुरुः ।
ममाऽत्मा सर्वभूतात्मा तस्मै श्री गुरवे नमः ॥
My lord is the lord of the universe (jagat); my guru is the guru of the three worlds; my atma is the atma of all the beings; I bow down to such lord = guru = self!

अखंड मंडलाकारं व्याप्तं येन चराचरम्
तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः
"akhanda mandalaakaaram" in which the whole of living and non-living beings appear, that word "tat" has been shown to me by the GURU. I bow down to such guru.

देहे जीवत्वमापन्नं चैतन्यं निष्कलं परम्
त्वं पदम् दर्शितं येन तस्मै श्रीगुरवे नमः
That which entered the body, that "jeeva chaitanyam" which is never tainted by anything, that word "tvam" has been shown to be by the GURU. I bow down to such guru.

अखंडं परमार्थं सत् ऐक्यं च त्वं तदोश्शुभम्
असिना दर्शितं येन तस्मै श्रीगुरवे नमः
akhandam, paramaardham that truth and body, this are one and the same that is shown by the word "asi". Such word is shown to me by the GURU. I bow down to the Guru.

Having said that, a small word of caution.
गुरवो बहवस्सन्ति शिष्य वित्तापहारकाः
दुर्लभ स्स गुरुर्लोके शिष्य संताप हारकः
guravah, bahavah, santi, sishya, vitta, apahaarakaaH.
durlabhaH, saH, guruH, loke, sishya, saMtaapa, haarakaH
There are lot of gurus who take away the wealth of the sishya; it is indeed difficult to get a guru who will take away the "worldly misery" of the sishya.

-- From skanda purana; GURU GEETHA.
(Most famous "gururbrahma, gururvishnu gurudevo maheswarah, gurussakshaat parabrahma tasmai sri gurave namaha" is also from this chapter of Skanda Purana only.)

Tuesday, March 8, 2011

ఈశ్వరీ - ఆమ్మ

Divine Mother appears in her four aspects as one's own mother, sister, wife and daughter. Respecting each of HER aspects in proper way is the due worship to the Divine Mother.

ప్రాతర్వదామి లలితే తవ పుణ్యనామ
కామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి
శ్రీ శాంభవీతి జగతాం జననీపరేతి
వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి

prAtarvadAmi lalitE tava puNyanAma
kAmESvarIti kamalEti mahESvarIti
SrI SaaMbhavIti jagatAM jananIparEti
vAgdEvatEti vacasA tripurESvarIti

-- International Women's Day (లలితా పంచరత్నం నుంచి)

Tuesday, March 1, 2011

సర్వార్థసాధకము

.....పాండునగ్రసుతుడు నిభృతమై దేవకి సుతునితోడ :

శివముఖ్యనామములు ప్రస్తవనకృతిన్ భోగమోక్షపదములగునని విం
దు విమలబోధ యెఱింగింపవె వాని నిరుక్తిననినఁ బరమప్రీతిన్

అతండిట్లనియె

శివదేవు ముట్టఁ గొల్వఁగ, నవనీశ్వర యతనిపేళ్ళయర్థ మెఱిఁగి సం
స్తవనకృతిఁ గూర్ప నాకైన విధాతకునైన నరిది నా మదిఁ జూడన్

నీవిట్లు నన్నునడిగితి గావున నాయెఱిఁగినట్టి గతిఁ జెప్పెద న
ద్దేవాదిదేవువరనామావలి విను మచలమైన యవధానముతోన్

అగ్నివాయువాసవాదిత్యవసుమరుదాది దేవతామయాత్ముఁ డైన
శివుని మహిమఁ బ్రీతిఁ జెప్పుట వినుట సర్వార్థసాధకంబు లగు నృపాల

శివ సహస్ర నామ స్తొత్రం:
http://sanskrit.safire.com/pdf/SHIVA_SAHA_MAHA.PDF


--శ్రీమదాంధ్రమహాభారతము అనుశాసనిక పర్వము, పంచమాశ్వాసము నుంచి
(మహాశివరాత్రి సందర్భంగా)

Thursday, February 24, 2011

నాల్గుచందములఁ పలుకుట

పలుకక యుండుకంటెఁ దగ బల్కుట మేలు వినుండు సత్యముం
బలుకుట ధర్మమార్గమునఁ బల్కుట సర్వజనప్రియంబుగాఁ
బలుకుట యోలి నెక్కుడగు భంగులు వీనినెఱింగి యొండుమైఁ
బలుకక నాల్గుచందములఁ బల్కఁగ మెత్తురు వాని దేవతల్.

-- హంస గీత, శ్రీమదాంధ్రభారతము, శాంతిపర్వము, పంచమాశ్వాసము, ౫౫౫

Friday, February 18, 2011

మహామాఘం

కుకర్మీ కుసంగీ కుబుద్ధిః కుదాసః కులాచారహీనః కదాచారలీనః
కుదృష్టిః కువాక్యప్రబంధః సదాహం గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని.

I am a person of
ku+karmii = bad deeds,
ku+sangii = bad associations
ku+buddhih = bad intellect
ku+daasah = bad servant (or a servant of bad masters)
kulaacharahiinah = given up my own correct way of life
kadaacharaliinah = taken up by some (incorrect) ways of life and submerged in them
ku+dRisThi = bad view
ku+vaakya prabandha = making bad statements and bound by them
sadaa+ahm = always (in the past, till now) have been
bhavani = O Bhavani,
tvam ekaa gatih+tvam, gatih+tvam = thou art alone is the only path, the only path

--మహామాఘం సందర్భంగా (Today is the auspicious mahaamaagham) Best day for complete surrender to the almighty and taking up the right path.

The snana, daana and japa done today will give tremendous good results in taking away agham (అఘం = పాపం bad effects of past bad deeds)

om tat sat

Monday, February 14, 2011

భీష్మ ఏకాదశి

సకరుణదివ్యచిత్త పరి శాంతమహత్త్వవిధానవిత్త ని
ర్వికృతవిలాసహృద్య శ్రుతివిస్తరవిస్ఫురణైకవేద్య పా
వకబహుభవ్యనామ పరివర్ధనసంక్షయదూరధామ వి
శ్వకలితతోషణా సుభగ సాత్యవతేయ వచోవిభూషణా.

సత్సేవ్యచరణ శమవద్వాత్సల్యాభరణ ధర్మతత్త్వోద్ధరణా
హృత్సంగతభక్తిక దురితోత్సారణధుర్యదృఙ్మయూఖవిసరణా

స్మయవిరహితపూజ్యా మంత్రగీతాధిరాజ్యా
నయనహిమగుసూర్యా నైష్ఠికక్షేమధుర్యా
దయితభువనరక్షా దాంతిసంపద్యతాక్షా
నియమ నికటవర్తీ నిష్కళానందమూర్తీ

--శ్రీమదాంధ్రమహాభారతము, అనుశాసనిక పర్వము, పంచమాశ్వాసము ౪౮౨,౪౮౩,౪౮౪
(భీష్మ ఏకాదశి సందర్భంగా)

Tuesday, February 8, 2011

శ్రీ పంచమి - సరస్వతీ స్తవము

सरस्वती स्तवम्

याज्ञवल्क्य उवाच​:
1.
कृपां कुरु जगन्मातर्
मामेवं हत तेजसम् ।
गुरुशापात् स्मृतिभ्रष्टं
विद्याहीनं च दुःखितम् ॥
2.
ज्ञनं देहि स्मृतिं विद्यां
शक्तिं शिष्य प्रबोधिनीम् ।
ग्रंथकर्तृत्व शक्तिं च​
सुशिष्यं सुप्रतिष्ठितम् ॥
3.
प्रतिभां सत्सभायां च​
विचार क्षमतां शुभाम् ।
लुप्तं सर्वं दैवयोगा-
न्नवीभूतम् पुनः कुरु ॥
4.
यथांऽकुरं भस्मनि च
करोति देवता पुनः ।
ब्रह्मस्वरूपा परमा
ज्योतीरूपा सनातनी ॥
5.
सर्व विद्याधिदेवी या
तस्यै वाण्यै नमो नमः ।
विसर्ग बिंदु मात्रासु
यदधिष्ठानमेव च ॥
6.
तदधिष्ठात्री या देवी
तस्यै वाण्यै नमो नमः ।
व्याख्यास्वरूपा सा देवी
व्यख्याधिष्ठातृरूपिणी ॥
7.
यया विना प्रसंख्यावान्
संख्यां कर्तुं न शक्यते ।
कालसंख्या स्वरूपा या
तस्यै देव्यै नमो नमः ॥
8.
भ्रम सिद्धांत रूपा या
तस्यै देव्यै नमो नमः ।
स्मृतिशक्ति ज्ञानशक्ति
बुद्धिशक्ति स्वरूपिणी ॥
9.
प्रतिभा कल्पना शक्तिर्
या च तस्यै नमो नमः ।
सनत्कुमारो ब्रह्माणं
ज्ञानं पप्रच्छ यत्र वै ॥
10.
बभूव मूकवत्सोऽपि
सिद्धांतं कर्तुमक्षमः ।
तदाऽऽजगाम भगवा-
नात्मा श्रिकृष्ण ईश्वरः ॥
11.
उवाच स च तां स्तौहि
वाणी विष्टां प्रजापते ।
स च तुष्टाव तां ब्रह्मा
चाज्ञया परमात्मनः ॥
12.
चकार तत्प्रसादेन
तदा सिद्धांत मुत्तमम् ।
यदाप्यनंतं पप्रच्छ
ज्ञानमेकं वसुंधरा ॥
13.
बभूव मूकवत्सोऽपि
सिद्धांतं कर्तुमक्षमः ।
तदा तां च स तुष्टाव
संत्रस्तः कश्यपाज्ञया ॥
14.
ततश्चकार सिद्धांतं
निर्मलं भ्रम भंजनम् ।
व्यासः पुराणसूत्रं च
पप्रच्छ वाल्मीकिं यदा ॥
15.
मौनीभूतश्च सस्मार
तामेव जगदंबिकाम् ।
तदा चकार सिद्धांतं
तद्वरेण मुनीश्वरः ॥
16.
संप्राप्य निर्मलं ज्ञानं
भ्रमांध्यध्वंसदीपकम् ।
पुराणसूत्रं श्रुत्वा च
व्यासः कृष्णकलोद्भवः ॥
17.
तां शिवां वेद दध्यौ च
शतवर्षं च पुष्करे ।
तदा त्वत्तो वरं प्राप्य
सत्कवीन्द्रो बभूव ह ॥
18.
तदा वेद विभागं च
पुराणं च चकार सः ।
यदा महें द्रः पप्रच्छ
तत्त्वज्ञानं सदाशिवम् ॥
19.
क्षणं तामेव संचिन्त्य
तस्मै ज्ञानं ददौ विभुः ।
पप्रच्छ शब्दशास्त्रं च
महेंद्रश्च बृहस्पतिम् ॥
20.
दिव्य वर्ष सहस्रं च
स त्वां दध्यौ च पुष्करे ।
तदा त्वत्तो वरं प्राप्य
दिव्यवर्षसहस्रकम् ॥
21.
उवाच शब्दशास्त्रं च
तदर्थं च सुरेश्वरम् ।
अध्यापिताश्च ये शिष्या
यैरधीतं मुनीश्वरैः ॥
22.
ते च तां परिसंचित्य
प्रवर्तंते सुरेश्वरीम् ।
त्वं सम्स्तुता पूजिता च
मुनीन्द्रैर्मनु मानवैः ॥
23.
दैत्येन्द्रैश्च सुरैश्चापि
ब्रह्म विष्णुशिवादिभिः ।
जडीभूत स्सहस्रास्यः
पंचवक्त्र श्चतुर्मुखः ॥
24.
यां स्तोतुं किमहं स्तौमि
तामेकास्येन मानवः ।
इत्युक्त्वा याज्ञवल्क्यश्च
भक्तिनम्रात्म कंधरः ॥
25.
प्रणनाम निराहारो
रुरोद च मुहुर्मुहुः ।
ज्योतिरूपा महामाया
तेन दृष्टाऽप्युवाच तम् ॥
26.
सुकवीन्द्रो भवेत्युक्त्वा
वैकुंठं च जगाम ह ।
याज्ञवल्क्य कृतं वाणी
स्तोत्रमेतत्तु यः पठेत् ॥
27.
स कवीन्द्रो महावाग्मी
बृहस्पतिसमो भवेत् ।
महा मूर्खश्च दुर्बुद्धिर्
वर्षमेकं यदा पठेत् ॥
स पंडितश्च मेधावी
सुकवीन्द्रो भवेद्ध्रुवम्

इति श्री देवी भागवते महापुराणे नवम स्कंधे सरस्वती स्तवनं नाम पंचमोध्यायः ॥

-- శ్రీ పంచమి (మాఘ శుద్ధ పంచమీ) సందర్భంగా

Monday, February 7, 2011

రామా! ఆర్తరక్షామణీ!

బాలక్రీడలఁ గొన్నినాళ్ళు, పిదపన్ భామాకుచాలింగనా
లోలాభ్యున్నతిఁ గొన్నినాళ్ళు, మరి యిల్లున్ ముంగిలిన్ గొన్నినా
ళ్ళీలీలన్ విహరించితిన్, సుఖఫలం బిందేమియున్ లేదుగా
హాళిన్ నీ పద సేవఁ జేసెదను రామా! ఆర్తరక్షామణీ!

-- శ్రీ రామ దాసు(?)

Saturday, January 29, 2011

కొఱగానివి

వాసన లేని పువ్వు, బుధ వర్గము లేని పురంబు,
భక్తి విస్వాసము లేని భార్య, గుణవంతుడు గాని కుమారుడున్,
సదాభ్యాసము లేని విద్య, పరిహాసము లేని వాచ్య ప్రసంగముల్,
గ్రాసము లేని కొలువు, కొఱగానివి పెమ్మయ సింగ ధీమణీ.

--- జక్కన చెప్పిన 'పెమ్మయ సింగధీమణి' శతకము నుంచి

vaasana lEni puvvu = A flower devoid of sweet smell,
budha vargamu lEni puramu = A city devoid of realized, wise men
bhakti visvaasamu lEni bhaarya = A wife devoid of devotion, faith
guNavantudu kaani kumaarudu = A son devoid of good qualities
sadaabhyasamu lEni vidya = A vidya (knowledge in a branch of science or arts etc., ) devoid of continuous practice (for own as well as others benefit!)
parihaasamu lEni vachya prasangamu = A speech (or a piece of literature work) devoid of sense of humor
graasamu lEni koluvu = A job devoid of right remuneration
koragaanivi = Absolutely useless! (they are useless even when possessed --- Just like black money in foreign banks!)

Wednesday, January 19, 2011

మహాత్ములకు నమస్కారం

ధన్యాః ఖలు మహాత్మానో మునయస్త్యక్తకిల్బిషాః || 5-26-49
జితాత్మనో మహాభాగా యేషాం న స్తః ప్రియాప్రియే |
ప్రియాన్న సంభవేద్దుఃఖమప్రియాదధికం భయం || 5-26-50
తాభ్యాం హి యే వియుజ్యంతే నమస్తేషాం మహాత్మనాం |

-- సుందరకాండ 26వ సర్గ నుంచి (సీతా మాత ఆలోచనలకి ఆదికవి వాల్మీకి పద రూపం)

49. mahaatmanaH = great souled ones; tyakta kilbishhaaH = with abandoned sins; jittatmanaH = with a conquered mind; mahaabhaagaaH = those with great fortune; munayaH = sages; dhanyaaH khalu = are indeed fortunate; yeshhaam = to whom; na staH = there is no; priyaapriye = pleasure or displeasure.

"Great souled ones with abandoned sins, with a conquered mind, those with great fortune, sages are indeed fortunate to whom there is no pleasure and displeasure."

50. priyaat = from pleasure; duHkham = sorrow; apriyaat = (and) from displeasure; adhikam bhayam = great fear; na sambhavet = do not occur (to great souls); ye = whoever; viyujyante = are separated; taabhyaam = from pleasure and displeasure; namaH = (my) obeisance; teshhaam mahaatmaanaam = to such great souls.

"From pleasure sorrow and from displeasure great fear do not occur to great souls. Whoever are separated from pleasure and displeasure, my obeisance to such great souls."

"ప్రియ-అప్రియ" ద్వంద్వం నుంచి విముక్తులైన మునులకు, మహాత్ములకు నా నమస్కారములు.

Wednesday, January 12, 2011

100వ టపా!

2008 అక్టోబరు చివరలొ నేను అంటూ మొదలు పెట్టిన ఈ బ్లాగు ఈ టపా తో నూరు టపాలు పొగు చేసుకుంది.
ఈ సందర్భంగా నా అభిమాన కావ్యమైన రామాయణం లోని సుందర కాండ నుంచి నాకు బాగా నచ్చిన ఆణిముత్యం లాంటి ఒక శ్లోకం:

(హనుమ సీతాదేవి కోసం లంక లో వెతుకుతూ అనేకులైన రావణ స్త్రీలను చూచి, ఇలా పర స్త్రీలను చూడడం ధర్మమేనా అనే సందేహం కలిగిన సందర్భంలో ఇలా అలోచిస్తునాడు. )

మనో హి హెతుః సర్వెషాం ఇంద్రియాణాం ప్రవర్తతే || 5-11-41
శుభాశుభాస్వవస్థాసు తచ్చ మే సువ్యవస్థితం |

(11 th sarga - verse 41 second half + 42 first half): shubhaashubhaasu= among auspicious or inauspicious; avasthaasu= states; pravartane- in the behavior; sarveshhaanaam indriyaaNaam= of all senses; manaH hetuH= mind is the reason; me= my; tachcha= that mind; suvyavasthitam= is very steady.

ఇలాంటి నిశ్చలమైన మనస్సే సమాధి. అటువంటి స్థితిని చేరుకోవడం కోసమే యోగులు సాధన చేస్తారు. ఆ దారి లోనే నా పయనం సాగుతోంది! ఆ పయనం లో ఇలాంటి ఆణిముత్యాలు తారస పడినప్పుడల్లా వాటిని ఇక్కడకి చేర్చుతానని ఆశిస్తూ....

Monday, January 10, 2011

బుద్ధి లక్షణం

అనారమ్భో మనుష్యాణాం ప్రథమం బుద్ధిలక్షణమ్,
ఆరబ్ధ​స్యాన్తగమనం ద్వితీయం బుద్ధిలక్షణమ్.

తా. బుద్ధిమంతులైన వాళ్ళ మొదటి లక్షణం ఏమిటంటే [కష్టం అనుకున్న పని] ప్రారంభించకుండా ఉండడం. ప్రారంభించినదానిని తుదముట్టించడం రెండవ లక్షణం.

-- సంస్కృత సూక్తి రత్నకోశః, ప్రథమా మఙ్జూషా, 17