Saturday, October 26, 2013

నర మేషం - కాల వృకం

దారా ఇమే మే, పశవశ్చ మే మే, ధనాని మే మే, ఇత్థం నరో మేష సమాన కంఠః అహోహ్యయం కాల వృకేణ నీతః

మే - అంటే సంస్కృతం లో "నాకు" లేదా "నాది" అనే అర్థం వస్తుంది. సామాన్యంగా నరులు "ఈ భార్య నాది నాది", ఈ పశువులు నావి నావి", ఈ ధనం నాది, ఇంకా నాకు కావాలి" అంటూ ఉంటారు. మేక కూడా "మే మే" అని అరుస్తూ ఉంటుంది.

అయ్యో! ఇలా జరుగుతూ ఉండగా, కాలం (మృత్యువు) లోడేలు (వృక) రూపంలో (తెలియకుండా వచ్చి)నరులను కబళించి వేస్తుంది కదా!!

--- ఈ శ్లోకాన్ని శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి గురువుగారు శ్రీ శ్రీ శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామివారు చెపుతూ ఉండేవారట. ఆలా అని ఒక అనుగ్రహ భాషణం లో శృంగేరీ జగద్గురువులు సెలవిచ్చారు.

dArA imE mE, paSavaSca mE mE, dhanAni mE mE, ittham narO mEsha samAna kanThaH ahOhyayam kAla vRkENa nItaH

In Sanksrit, "mE" means "for me" or "mine". Usually man keeps bleating "this wife is mine and for me", "these animals are mine and more for me" and "this money is mine and need more for me" like a goat. Alas! as this bleating is going on, the kAla (time in the form of death which is not apparent) is taking away the man goat!

-- Quoted by Sri Sri bhAratI tIrtha mahA swami in one of the anugraha bhAshaNam in recent vijaya yAtra through Andhra pradesh. It used to be quoted by parama guru SrI SrI SrI abhinava vidyAtIrtha mahaswami.

No comments: